వెండితెరపై ముద్దుల ఉత్సవం!

సందేశాత్మక కథా చిత్రం ‘మిణుగురులు’తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అయోధ్య కుమార్‌. ఇప్పుడీయన దర్శకత్వంలో రూపొందిన ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘24 కిస్సెస్‌’. నీకో సగం, నాకో సగం ఈ ఉత్సవం.. అనేది ఉపశీర్షిక. అదితి అరుణ్, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సిల్లీమాంక్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర టైటిల్‌కు తగ్గట్లే ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ఆద్యంతం ఘాటైన అధరచుంబనాలతో యువతరం దృష్టినీ ఆకర్షించాయి. ఇటీవలే నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం.. తాజాగా సెన్సార్‌ను పూర్తి ‘ఏ’ సర్టిఫికెట్‌ను పొందింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఓ బోల్డ్‌ కంటెంట్‌తో కూడా సరికొత్త ప్రేమకథతో చిత్రాన్ని రూపొందించాం. సినిమాలో ఆదిత్, హెబ్బాల కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అన్నివర్గాలను ఆకర్షించేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. అక్టోబరు 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అన్నారు. రావు రమేష్, నరేష్‌ కీలకపాత్రల్లో నటించారు. జºయ్‌ బరువా సంగీతం అందించారు.
© Sitara 2018.
Powered by WinRace Technologies.