అను బేబీ.. సరే ఆగవే.. అణుబాంబులా చూడకే!

నాగచైతన్య - మారుతీల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ ఎస్‌, పీడీవీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అను ఇమ్మానుయేల్‌ కథానాయిక. గోపి సుందర్‌ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘అను బేబీ.. సరే ఆగవే..’’ అంటూ సాగే వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఈ పాట ఆద్యంతం చాలా కలర్‌ఫుల్‌గా సాగింది. ఈ పాట విడుదల కాగానే చైతూ సతీమణి సమంత ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘‘ఈ పాట నాకు చాలా నచ్చింది’’. అని ట్వీట్‌ చేస్తూ వీడియోను పంచుకున్నారు. ఇందులో నటి రమ్యకృష్ణ ‘శైలజారెడ్డి’గా ప్రధాన పాత్రలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


© Sitara 2018.
Powered by WinRace Technologies.