తమిళ్‌ ‘అర్జున్‌రెడ్డి’ రాకకు వేళాయే..

టాలీవుడ్‌ ట్రెండ్‌ సెట్టర్‌ ‘అర్జున్‌ రెడ్డి’ని తమిళ్‌లో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో దేవరకొండ పాత్రను విక్రమ్‌ తనయుడు ధృవ్‌ చేస్తుండగా.. షాలిని పాండే పాత్రలో భణిత సంధు నటిస్తోంది. తొలుత ఈ సినిమాను బాలా దర్శకత్వంలో తెరకెక్కించగా.. అవుట్‌పుట్‌ అనుకున్న విధంగా లేకపోవడంతో దాన్ని పక్కకు పెట్టేశారు. అనంతరం ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను సందీప్‌ వంగా శిష్యుడు గిరీసాయకు అప్పగించారు. ఇటీవలే చిత్ర షూటింగ్‌ కూడా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కూడా తుది దశకు చేరుకోవడంతో విడుదల తేదీని ఫిక్స్‌ చేసుకునే పనిలో పడింది చిత్ర బృందం. తాజాగా కోలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ధృవ్‌ వివిధ కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమై సినిమాకు ప్రచారమందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.