పండగ వేళ మరో శుభవార్త..

మహేష్‌బాబు నుంచి సినీప్రియులకు దసరా కానుకలు అందుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. కొండరెడ్డి బురుజు ముందు చేతిలో గొడ్డలి పట్టుకోని ఫుల్‌ యాక్షన్‌ మూడ్‌తో పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చి అభిమానుల్లో ఆనందం నింపాడు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్‌ బయటకొచ్చింది. మహేష్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టినట్లు తెలుపుతూ డబ్బింగ్‌ స్టూడియోలోని ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 75శాతం చిత్రీకరణను పూర్తిచేసేసుకుంది. త్వరలోనే మిగిలిన షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకోని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్‌కు జోడీగా రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.