‘24 కిస్సెస్‌’.. ఈ డేట్‌ పక్కా ఫిక్స్‌!
                            

సందేశాత్మక కథా చిత్రం ‘మిణుగురులు’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అయోధ్య కుమార్‌ కృష్ణం శెట్టి.. ఇప్పుడు పూర్తిస్థాయి రొమాంటిక్‌ కథతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘24 కిస్సెస్‌’. అదిత్‌ అరుణ్, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబరు 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘టైటిల్‌ను బట్టీ ఇది కేవలం యువతరమే లక్ష్యంగా తీసిన చిత్రం అనుకోకండి. చిత్ర నేపథ్యం తగ్గట్లుగా ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది క్లీన్‌ ఎంటర్‌టైనర్‌. జోయ్‌ బారువా సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నవంబరు 23న విడుదలవుతుంది’’ అన్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.