కథ ఒకటే.. కథనాలే వేరు

విశాల్‌ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన ‘అయోగ్య’. పూరి జగన్నాథ్‌ - ఎన్టీఆర్‌ల కలయికలో వచ్చిన హిట్‌ చిత్రం ‘టెంపర్‌’కు తమిళ రీమేక్‌ ఇది. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత మాల్కాపురం శివ. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘తెలుగులో విజయం సాధించిన ‘టెంపర్‌’ను తమిళ్‌లో రీమేక్‌ చేయడం.. ఇప్పుడు దాన్ని మళ్లీ ఇక్కడి ప్రేక్షకుల కోసం తీసుకురావడం సంతోషకర విషయం. ఈ రెండు చిత్రాల మూలాంశం ఒకటే అయినప్పటికీ కథనం పరంగా చాలా మార్పు కనిపిస్తాయి. దీన్ని దర్శకుడు వెంకట్‌ ఎంతో చక్కగా చూపించారు. ముఖ్యంగా ‘అయోగ్య’లో క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది. ఒకే కథను రెండు రకాలు తీస్తే ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు చూపించాలనుకున్నాం. అందుకే కథ తెలిసినదే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.