‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుక అతిథులెవరంటే?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నయనతార కథానాయిక. తమన్నా, బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌సినిమాపై అంచనాలు పెంచేసింది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముందస్తు విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్‌.బి. స్టేడియంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అదే వేడుకలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతుంది చిత్ర బృందం. ఈ వేడుకకు  పవన్‌ కల్యాణ్‌, దర్శకులు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, కొరటాల శివ, వి.వి. వినాయక్‌ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. కొణిదల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నటుడు రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.