విడుదలకు సిద్ధమైన `హ‌ల్‌చ‌ల్‌

రుద్రాక్ష్‌, ధ‌న్య బాల‌కృష్ణ న‌టీనటులుగా తెర‌కెక్కుతున్న చిత్రం `హ‌ల్‌చ‌ల్‌`. శ్రీ రాఘ‌వేంద్ర ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మితమవుతన్న ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకుడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గణేష్‌ కొల్లూరి మాట్లాడతూ.. సినిమా చాలా బాగా వ‌చ్చింది. రుద్రాక్ష్‌, ధన్య బాల‌కృష్ణలు బాగా నటించారు. మా బ్యాన‌ర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంద‌నే న‌మ్మ‌కముంది. మంచి టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. ద‌ర్శ‌కుడు శ్రీపతి అనుకున్న పద్ధతి ప్రకారం, బ‌డ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాడు. హ‌నుమాన్‌, భ‌ర‌త్ సంగీతం అందించిన ఈ సినిమాకి రాజ్‌తోట కెమెరా వ‌ర్క్ అందించారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేశారు. ఈ స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. ఇందులో కృష్ణుడు, మధునందన్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: హ‌నుమాన్‌, భ‌ర‌త్‌, కెమెరా: రాజ్‌తోట‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: ఆర్‌.కె.రెడ్డి,


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.