‘దేవ్‌’గా వస్తున్న కార్తిక్‌
కార్తి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్‌’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. రజత్‌ రవిశంకర్‌ దర్శకుడు. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌, ఠాగూర్‌ మధు నిర్మాతలు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఖాకి’ తరవాత కార్తి, రకుల్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌, ముంబై తదితర ప్రదేశాలతో పాటు హిమాలయ ప్రాంతాల్లోనూ చిత్రీకరణ జరిపాం. హరీష్‌ జయరాజ్‌ సంగీతం అందించారు. డిసెంబరులో విడుదల చేస్తామ’’న్నారు.
© Sitara 2018.
Powered by WinRace Technologies.