ఆంక్షలు లేని ప్రేమ... ‘కేరాఫ్‌ కంచరపాలెం’
ఆంక్షలు లేని ప్రేమ అంటే ఏమిటో తెలిపే చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’ అంటోంది చిత్రబృందం. రానా దుగ్గబాటి సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహా వెంకటేశ్‌ దర్శకత్వంలో రూపొందుతోందిది. వైజాగ్‌ దగ్గరలోని కంచరపాలెం అనే ప్రాంతం కేంద్రంగా సాగే ఈ చిత్రం ద్వారా ప్రేమ అవధులు లేనిదనే సందేశాన్ని అందించనున్నట్లు రానా ట్వీట్‌ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. చిత్ర ట్రైలర్‌ను ఆగష్టు 15న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రం న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది. నిర్మాత: ప్రవీణ్‌ పరుచూరి.






© Sitara 2018.
Powered by WinRace Technologies.