ఆ రోజు మాత్రమే చెప్తారట!

కథానాయకుడు విజయ్‌ దేవరకొండ కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఆయనతో ‘పెళ్ళిచూపులు’ తెరకెక్కించిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. అభినవ్‌ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వం వహించారు. వర్ధన్‌ దేవరకొండ మరో నిర్మాత. ఈ చిత్రాన్ని నవంబరు 1న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా వర్ధన్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘మంచోడు అనే ఇమేజ్‌ని కాపాడుకొనేందుకు ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ ఇమేజ్‌కి భంగం వాటిల్లేలా చేసిన ఓ చిన్న తప్పుని సరిదిద్దుకొనే ప్రయత్నంలో ఎవరేం చేశారు? ఆ క్రమంలో ఎంత కామెడీ పండిందనేది తెరపైనే చూడాలి. యువతరానికి కనెక్ట్‌ అయ్యే అంశంతో రూపొందింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, పాటలకి మంచి స్పందన లభించింది’’ అన్నారు. పావని గంగిరెడ్డి, నవీన్‌ జార్జ్‌ థామస్, అవంతిక మిశ్రా, వినయ్‌ వర్మ, జీవన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మదన్‌ గుణదేవా, సంగీతం: శివకుమార్, కళ: రాజ్‌కుమార్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.