‘ముద్ర’ పడేది ఆరోజే..
ఠాగూర్‌ మథు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘ముద్ర’. ‘కిర్రాక్‌ పార్టీ’ చిత్రం తరువాత నిఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. తమిళచిత్రం ‘కనితన్‌’కు దర్శకత్వం వహించిన టిఎన్‌ సంతోష్‌ తెలుగులో రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్‌ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనున్నారు. తమిళ సంగీత దర్శకుడు సామ్‌ స్వరాలను సమకూర్చుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.© Sitara 2018.
Powered by WinRace Technologies.