‘భీష్మ’ అప్పుడొస్తాడు

వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక కథానాయిక. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఇందుకు ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను క్రియేట్‌ చేశారు. గులాబి పువ్వు పట్టుకున్న నితిన్‌ చేయి మాత్రమే కనిపిస్తూ... అమ్మాయిల కార్టూన్స్‌తో డిజైన్‌ చేసిన పోస్టర్‌ ఆసక్తి రేకెత్తిస్తుంది. ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అనేది భీష్మ క్యాప్షన్‌. దీని బట్టి చూస్తే చాలా మందిని ప్రేమించి వాళ్లు కాదన్న బాధతో సింగిల్‌గా ఉండే కుర్రాడా, తన వెనక ఎంత మంది అమ్మాయిలు తిరుగుతున్నా పట్టించుకోకుండా ఒంటరిగానే ఉండాలనే వాడా? అనేది తెలియాలంటే క్రిస్టమస్‌ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ‘భీష్మ’ థియేటర్లలో సందడి చేసేది అప్పుడే. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రష్మిక,నితిన్‌ అభిమానులతో పంచుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్్స పతాకంపై రూపొందుతుందీ చిత్రం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.