తన పేరే సినిమా పేరు

వి
జయ్‌ సేతుపతి, రాశీఖన్నా జంటగా తమిళంలో తెరకెక్కుతున్న ‘సంగతమిళ్‌’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకి ‘విజయ్‌ సేతుపతి’ అని కథానాయకుడి పేరునే ఖరారు చేశారు. నివేద పేతురాజ్‌, అశుతోష్‌ రాణా తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్‌చందర్‌ దర్శకుడు. తమిళంలో విజయా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో రావూరి వి.శ్రీనివాస్‌ ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. ‘సైరా’తో మెప్పించిన విజయ్‌ సేతుపతితోపాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పలువురు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రెండు   భాషల్లోనూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.వేల్‌రాజ్‌, సంగీతం: వివేక్‌ - మెర్విన్‌.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.