‘సాక్ష్యం’.. చూపేందుకు సిద్ధం
ప్రేమకి మనసు సాక్ష్యం. వానకి చినుకు సాక్ష్యం. నింగికి నేల సాక్ష్యం. మరి బెల్లంకొండ శ్రీనివాస్‌ చెప్పే సాక్ష్యం ఎందుకో, ఎవరి కోసమో తెలియాలంటే ‘సాక్ష్యం’ చూడాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ నామా నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. బెల్లంకొండ, వెన్నెల కిషోర్‌ తదితరులపై కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మాస్‌ అంశాలు, యాక్షన్‌, కుటుంబ బంధాలు, ప్రేమ.. ఇవన్నీ మేళవించిన చిత్రమిది. వీటితో పాటు ప్రేక్షకుల ఊహకు అందని ఓ సరికొత్త అంశం కూడా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. జూన్‌ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు. సంగీతం: హర్షవర్ధన్‌.

సంబంధిత వీడియోలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.