‘సైరా’ స్వరాలు అలా చేజారాయి
చిరంజీవి 151వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది ‘సైరా’. ఈ చిత్రం ప్రారంభమైనప్పుడు సంగీతం అందించేది ఎ.ఆర్‌. రెహమాన్‌ అని ఖరారు చేసింది చిత్ర బృందం. తీరా టీజర్‌ చూశాక కానీ చాలా మందికి తెలియలేదు మ్యూజిక్‌ ఇచ్చింది బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది అని. ఇంతకీ రెహమాన్‌ ‘సైరా’కు అందించలేదంటే.. సమయం లేకపోవడం వల్ల ఓ పాటను అప్పటికప్పుడే చిత్రీకరించాలనుకుంది ‘సైరా’ బృందం. దాని కోసం భారీ సెట్‌ కూడా వేశారు. వేల సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులను తీసుకున్నారు. రెహమాన్‌ ఎంత బిబీగా ఉంటారో తెలిసిన విషయమే. అప్పటికి రెహమాన్‌ డేట్స్‌ కుదరలేదు. దాంతో అనుకున్న సమయానికి ఆయన ఇవ్వలేరని, ఆలస్యమవుతుందనే కారణంగా రెహమాన్‌ ఈ సినిమాకు పనిచేయలేదని చిత్ర దర్శకుడు సురేందర్‌ రెడ్డి అన్నారు.


నేపథ్య సంగీతానికి మరొకరు:
‘సైరా’లో ఉన్నవి రెండు పాటలు మాత్రమే. బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే థీమ్‌ సాంగ్‌ ఒకటి. రెహమాన్‌ స్థానంలో ఎవరైతే బావుంటారా అనే ఆలోచనలో ఉన్నప్పుడు అమిత్‌ త్రివేదీని తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే అమిత్‌ కేవలం పాటలకు మాత్రమే పనిచేశారు. నేపథ్య సంగీతానికి అందించేందుకు అమిత్‌ అధిక సమయం కోరడంతో జూలియస్‌ పేకియమ్‌ను సంప్రదించింది చిత్ర బృందం. టీజర్‌ చూస్తే జూలియస్‌ తన మ్యూజిక్‌తో సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లాడో తెలుస్తుంది. అలా రెహమాన్‌, అమిత్‌ తమ అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. కొణిదల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.