అభిమానులకు చరణ్ స్వీట్‌ సర్‌ప్రైజ్

‘నేను నాన్నకు నిర్మాతగా మారిన తర్వాతనే ఆయనలోని నిజమైన మెగాస్టార్‌ను చూడగలిగాను’’ అంటున్నారు ఆయన తనయుడు, కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆయన నిర్మాతగా తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రం రూపొందింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. నయనతార చిరుకు జోడీగా నటించగా.. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, కిచ్చా సుదీప్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా నిర్మాత రామ్‌చరణ్‌ ‘సైరా’ సెట్స్‌లో తన తండ్రితో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో చిరు సైరా గెటప్‌లో ఉండగా.. ఆయన మేకప్‌ను సరిచేస్తున్నట్లుగా చరణ్‌ దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.