‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం మలయాళ భాషలో..
రామ్‌చరణ్‌.. ఎన్టీఆర్‌ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ముస్తాబవుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దీనికి ‘రౌద్రం రణం రుధిరం’ అన్న టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటీవలే మోషన్‌ పోస్టర్‌ను, చరణ్‌ పుట్టిన రోజు కానుకగా ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ టీజర్‌ విడుదల కాగా.. ఒక్క మలయాళం తప్ప అన్ని భాషల్లోనూ ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఒకరకంగా ఈ ప్రచార చిత్రానికి ఎన్టీఆర్‌ గాత్రమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం మలయాళంలోనూ డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.
అందాల తుఫాన్‌
స్టన్నింగ్‌ బ్యూటీ...ఎట్రాక్టివ్‌ పర్సనాలిటీ...హంటింగ్‌ స్మైల్‌... రొమాంటిక్‌ లుక్స్‌... వావ్‌ అన్పించే డాన్సింగ్‌ స్కిల్స్‌...సూపర్‌ యాక్టింగ్‌...వెరసి రిషిబాల నావల్‌. 90 దశకంలో అందంతో, అభినయంతో హల్చల్‌ చేసిన సొగసుల హల్చల్‌. సిల్వర్‌ స్కీన్ర్‌కి గ్లామర్‌ అద్ది అలనాటి యువ ప్రేక్షకులకెన్నో నిదురలేని రాత్రులు బహూకరించిన సోయగాల తారక...వెండితెర నాయిక. ఆమె సినిమా చూసి వచ్చిన తరువాత పొరపాటున ఆదమరిచి నిద్రపోతే...ఆ నిద్రలోనూ హఠాత్తుగా ఏతెంచె అర్ధరాత్రి కల. రిషిబాల నావల్‌ సినిమా వస్తోందంటే చాలు... థియేటర్ల ప్రాంగణంలో జాతరే జాతర. టికెట్‌ కౌంటర్స్‌ ఎదుట గంటల తరబడి ఎదురుచూపులు. అంతలా మెస్మరైజ్‌ చేసిన రిషిబాల నావల్‌ అంటే... ఎవరా? అనే సందేహం ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకులకు కూడా రావొచ్చు. ఆ పేరు గల వెండితెర తారక లేరంటూ వాదించవచ్చు. అయితే... ఆమె స్కీన్ర్‌ నేమ్‌ చెప్తే చాలు...కళ్లింతలు చేసుకుని మరీ విస్మయానికి లోనవుతారు కూడా. ఔను ... రిషిబాల నావల్‌ మరెవరో కాదు... మనందరికి తెలిసిన సిమ్రాన్‌.
ఏప్రిల్‌ 7 (సినీ చరిత్రలో ఈరోజు)...
ఇప్పుడంటే చిన్నపిల్లలకు కూడా యానిమేషన్‌ అంటే ఏమిటో, గ్రాఫిక్స్‌ అంటే ఏమిటో, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంటే ఏమిటో... అన్నీ తెలుసు. ఈ సాంకేతికత ఏమీ లేని రోజుల్లో ఓ బొమ్మ కదలడమే వింత. ప్రపంచంలోనే తొలిసారిగా ఆ వింతను కళ్ల ముందు చూపించిన యానిమేటెడ్‌ కార్టూన్‌గా ‘హ్యూమరస్‌ ఫేజెస్‌ ఆఫ్‌ ఫన్నీ ఫేసెస్‌’ (1906) అనే మూకీ గురించి చెప్పుకోవాలి. సుద్దముక్కతో నల్లబల్లమీద ఓ చిత్రకారుడు గీస్తున్న బొమ్మలు అప్పటికప్పుడు కదలడం, ఓ జోకర్‌ టోపీ ఎగరేస్తూ విన్యాసాలు చేయడం, యజమాని ఆడిస్తుంటే ఓ కుక్క రింగ్‌లోంచి దూకడం, ఓ వృద్ధుడు అమ్మాయిని చూడగానే తబ్బిబ్బు పడడం, ఓ పక్క డస్టర్‌తో చెరిపేస్తున్నా కూడా ఆయా బొమ్మలు కదులుతూ నవ్వించడం లాంటి దృశ్యాలతో ఈ కార్టూన్‌ చిత్రం రూపొందింది. దీని నిడివి కేవలం 3 నిమిషాలు. యానిమేషన్‌ టెక్నిక్‌కి ఆద్యుడిగా పేరొందిన జేమ్స్‌ స్టువార్ట్‌ బ్లాక్‌టన్‌ దీనికి దర్శకుడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.