Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
అభిమానుల పేజీ
పక్కన నేనే
మరిన్ని
కల్యాణ్ రామ్‌తో నేను..
టాలీవుడ్ హీరోల్లో కల్యాణ్ రామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను ఒక్కసారైనా కలవాలనే నా కోరిక హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ వేడుకలో నెరవేరింది. ఆయనతో కరచాలనం చేస్తూ ఫొటో దిగడం ఎప్పటికీ మర్చిపోలేను.
నాటి ఫ్యామిలీ హీరో.. నేటి స్టైలిష్ విలన్‌తో నేను
జగపతి బాబు నటన నాకు చాలా ఇష్టం. నాడు కుటుంబ కథల్లో హీరోగా కనిపించినా.. నేడు ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించినా ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటారు. ఓ సందర్భంలో ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. అపుడు దిగిన ఫొటోనే ఇది. అభిమాన నటుడి పక్కన నిలబడిన ఆ క్షణం మరిచిపోలేను.
తనికెళ్లతో నేను..
నటుడు తనికెళ్ల భరణి నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన నటించిన చాలా సినిమాలు చూశాను, చూస్తాను కూడా. ముఖ్యంగా ‘యమలీల’ చిత్రంలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలంటూ పండించే హాస్య సన్నివేశం నాకెంతోగానో నచ్చింది.
‘సాహో’ వీరుడితో నేను
తెలుగు చిత్రసీమ గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసిన ‘బాహుబలి’తో నేను. ‘సాహో’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ కలిసి నేను దిగిన ఫోటో ఇది. నా అభిమాన నటుడితో కలిసి దిగిన ఈ ఫోటో నేను ఎప్పటికీ మరచిపోలేను.
నా అభిమాన హీరో బాలయ్యతో..
మా అభిమాన కథానాయకుడు, గోల్డెన్ స్టార్ బాలకృష్ణ నల్గొండలో ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు కలిసి దిగిన ఫోటో ఇది.
నా అభిమాన నటుడితో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఆయనతో కలిసి దిగిన ఈ ఫోటో ఇది. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుంది.
ఎందుకు నచ్చిందంటే..
మరిన్ని
ఎదురంటూ లేనేలేని మొనగాడు ‘వీడే’లే
నాకు తెలుగు పాటలంటే మహా ఇష్టం. సంగీతం, సాహిత్యం ఆకట్టుకుంటే చాలు ఒకటికి పది సార్లు వింటుంటా. ఈ మధ్యకాలంలో అలా ఆస్వాదించిన గీతం ‘ఎదురంటే లేనేలేని మొనగాడు వీడేలే’. రవితేజ కథానాయకుడుగా వచ్చిన చిత్రమిది. ఓసారి అనుకోకుండా యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌ని సెలెక్ట్ చేశా. ఎప్పుడో బాల్యంలో విన్నట్టుగా ఉన్నాయనుకుని మొత్తం పాటలు ఓ సారి తీరిగ్గా విన్నాను. ‘ఎదురంటే’ పాట చిన్నతనానికి తీసుకెళ్లింది. ఎందుకంటే ఆ రోజుల్లో తెలిసీ తెలియక పాడుతూ ఉండేవాడ్ని ఈ హుషారు గీతాన్ని.
అలాంటిలాంటి అమ్మాయి కాదురా!
నాకు రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం అంటే చాలా ఇష్టం. హుషారెత్తించే పాటైనా.. ప్రేమ రాగమైనా.. ప్రత్యేక గీతమైనా ఆయన శైలి ప్రత్యేకం. ఆయన నుంచి కొత్త పాటలు ఎప్పుడొస్తాయా? అని ఆసక్తి ఎదురుచూస్తుంటాను. ఆయన రాసిన వాటిలో నేను మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? అని అన్వేషిస్తుంటాను. అలా వెతుకుతున్నప్పుడు వినపడింది ‘అలాంటిలాంటి అమ్మాయి కాదురా’. మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా తెరకెక్కిన ‘గుంటూరోడు’ చిత్రంలోనిదీ గీతం. డీజే వసంత్ స్వరాలు సమకూర్చగా విజయ్ యేసుదాస్ చక్కగా ఆలపించారు. కథానాయకుడు తను ఇష్టపడే అమ్మాయి గురించి వివరించే పాట ఇది. నిడివి తక్కువైనా భావం లోతైంది. ఆ పాట వినగానే ‘సితార’ పాఠకులతో నా అభిప్రాయం పంచుకోవాలనిపించింది.
‘రాగలీల’.. రూటు మార్చిన జంధ్యాల
జంధ్యాల.. ఈ పేరు వినగానే వెంటనే కదలాడేవి కుటుంబ కథా చిత్రాలు, నవ్వులు పూయించే సన్నివేశాలు. ఓ సందర్భంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాల జాబితా చూస్తుండగా ‘రాగలీల’ కంటపడింది. జంధ్యాల రూటు మార్చి కొత్తగా ప్రయత్నించారా? అయినా ఆయన ఇలాంటి సినిమాలు తీస్తారా? అనే సందేహం కలిగింది. చూసిన తర్వాత ఇంగ్లిష్ సామెత (డోన్ట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ) గుర్తొచ్చింది. ఎందుకంటే రొమాంటిక్ చిత్రం అయినప్పటికీ ఎక్కడా అభ్యంతర దృశ్యాలు కనిపించవు. తన మార్క్ సంభాషణలతో అలరిస్తూనే పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు. 1987లో వచ్చినప్పటికీ ఈతరం ప్రేక్షకుల్ని హత్తుకునే వైవిధ్యమైన ఈ చిత్ర విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను...
బూతో.. నీతో.. సినిమా ఆడాలి!!
‘‘సినిమా ఆగిపోయిన రోజు ప్రపంచం కూడా ఆగిపోతుంద’’న్నారు ఓ ప్రముఖ రచయిత. ‘‘బూతో.. నీతో.. సినిమా ఆడాల’’న్నారు దర్శకుడు హరీష్ శంకర్. అవును!! సినిమా ఆడితేనే ప్రపంచం సాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదేమో. సినిమా అంటే రంగుల ప్రపంచం.. అదో మాయా లోకం.. ఇది నాణేనికి ఓ వైపు. అందుకే కొంతమంది సినిమాని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. సినిమా అంటే దైవం.. అదే ప్రాణం.. ఇది నాణేనికి మరోవైపు. అందుకే చాలామంది అన్నీ వదిలి సినిమానే నమ్ముతారు. సినిమాని నిలబెడతారు. ఈ జాబితాలోనే నిలుస్తారు హరీష్. వరుణ్ తేజ్ కథానాయకుడుగా ఈయన తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్’లోని కొన్ని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సినిమా అంటే ఓ భావోద్వేగం. సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు జీవితం అనే సత్యాన్ని చెప్పారు. దర్శకులు కావాలనుకునే వారికి ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తినిస్తాయి. అంతా అయిపోయింది.. మనం చేయడానికి ఇంకేముందనుకునే వాళ్లలో ఆశ రేకిత్తిస్తాయి. అధర్వ, తనికెళ్ల భరణి మధ్య సాగే సంభాషణ వింటే సినిమా అంటే హరీష్‌కి ఎంత మక్కువో అర్థమవుతుంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని మెగా ఫోన్ పట్టిన ఆయన్ను తనికెళ్ల భరణిలో చూ
‘ఘరానా మొగుడు’ వినోదం పంచుతూనే ఉంటాడు
నేను ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల జాబితాలో ముందుంటుంది ‘ఘరానా మొగుడు’. చిరంజీవి, నగ్మ, వాణి విశ్వనాథ్ నటన, కీరవాణి సంగీతం, రాఘవేంద్రరావు టేకింగే దానికి కారణం. సినిమా వచ్చి పాతికేళ్లపైనే అయినా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా చిరంజీవి మ్యానరిజం అప్పట్లో ఓ ట్రెండ్. ‘ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకోండి’’ అంటూ చిరు చెప్పే సంభాషణ భలే గమ్మత్తుగా ఉంటుంది.
చెప్పినట్టుగానే ట్రెండ్ సెట్ చేశాడు
-తెలుగు తెరపై సరికొత్త పోలీసుని పరిచయం చేసిన సినిమా ఇది. దర్శకుడు కాకుండా ఓ అభిమానే పవన్‌ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించిన సినిమా ఇది. అయితే ఈ ఫలితం వెనక ఎన్నో సమస్యలున్నాయి.
ఫొటో మాది−మాట మీది
మరిన్ని
బాణీ.. కహానీ
తమన్ సంగీతంలో చాలా మార్పులు వచ్చాయి. ఇది వరకు బీట్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే తమన్.. ఇప్పుడు హార్ట్ ‘బీట్’ కూడా స్పందించేంత మధురమైన మెలోడీలు అందిస్తున్నాడు. ఫాస్ట్ బీట్‌కి ఎవరైనా పాటలు రాసేయొచ్చు. బాణీ హోరులో,
ఫుల్ ‘పటాస్’
యువ దర్శకుల శైలి చూస్తే... ఒకొక్కరూ ఒక్కో రకం అనిపిస్తోంది. కొంతమంది మాస్ మంత్రం జపిస్తున్నారు. ఇంకొంత మంది వినోదాత్మక చిత్రాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. కొంతమంది ప్రయోగాల బాట పడితే, ఇంకొంతమంది సకుటుంబ సపరి వార సమేతంగా చూసేలా సినిమాల్ని రూపొందిస్తున్నారు. అనిల్ రావిపూడిది
ఎర్ర నవ్వులు
ఆర్.నారాయణమూర్తి సినిమాలు సీరియెస్‌గా ఉంటాయి. ఆయన వెండి తెరపై మాట్లాడితే మినీ ఫైటు చేసినట్టే. బయట మాత్రం అంతా ‘శాంతం.. ప్రశాంతం’. ‘బ్రదర్..’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. మనస్ఫూర్తిగా మాట్లాడతారు. మొహమాటం లేకుండా బదులిస్తారు.
మెగా మంతనాలు ఎందుకో...?
పవన్ కల్యాణ్‌ని ఇప్పుడో సినిమా స్టార్‌గానే చూడలేం. ఆయనో ప్రజా జీవి. ఇటీవల సినిమావాళ్లతో కంటే ప్రజలతోనే ఎక్కువగా గడుపుతున్నారు. అడపా దడపా సినిమా ఫంక్షన్లలో మెరుస్తున్నారు. ఇది వరకు ఆయన్ని కదిపితే సినిమా కబుర్లు వినిపించేవేమో. ఇప్పుడు అలా కాదు. ప్రజల సాధక బాధకాలు ఆయన గళంలో
స్మైలు స్మైలురా...
రాజశేఖర్లో బాగా నచ్చేది ఆయన నవ్వు. టూత్ పేస్ట్ యాడ్లోలా ఆయన నవ్వుతుంటే... లైట్లు వేయాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తుంటుంది. ఆయన్ని యాంగ్రీ యంగ్ మెన్ అంటారు గానీ, ఆల్వేస్ స్మైలీమెన్ అని పిలిచినా తప్పులేదనిపిస్తుంది. ఎందుకంటే.. ఆయన కంటే ముందు ఆయన నవ్వే మనల్ని పలకరిస్తుంది.
ఫొటో మాది−మాట మీది
రాజేంద్రుడు ఉన్నాడంటే.. అక్కడ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేం. ఆ మాటల్లో సరదాలు, ఛమక్కులు, స్మృతులు ఎన్నో ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని గమ్మత్తైన కబుర్లు మొదలయ్యాయి. అంతలో దర్శకుడు సతీష్.. ఏదో గుర్తొచ్చి టాబ్ తెరిచారు.