సెల్‌.. మోహనరంగ
ప్రపంచమంతా గుప్పెట్లోకి వచ్చేసింది...! సెల్‌ఫోన్‌ రూపంలో. చుట్టాలు, స్నేహితులు, ఆత్మీయులు.. అందరూ ఆ పరికరంలోకి వచ్చేశారు. ఎవరేం చేస్తున్నారు, చేయబోతున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు.? ఒక్క మీట నొక్కితే తెలిసిపోతాయి. కాకపోతే... నవతరం అందుకున్న ఈ టెక్నాలజీని పెద్దవాళ్లు అర్థం చేసుకోవడం కష్టమే. చాలామందికి ఎర్ర బటన్‌, పచ్చ బటన్‌ తప్ప ఏం తెలీదు. వాట్సప్‌లూ, ఫేస్‌బుక్‌లు ఎంత చదివినా వాళ్లకు అర్థం కావు. నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణలు కూడా పాత కాలపు మనుషులే. అందుకేనేమో ‘అదెంత సేపు నాన్నా.. ఇదిగో ఇలా చేస్తే చాలు..’ అంటూ ఎన్టీఆర్‌ సెల్‌ఫోన్‌ కిటుకులేవో చెబుతుంటే.. వాళ్లిద్దరూ ఆసక్తిగా అందులో లీనమైపోయారు ఇలా. రేపో మాపో... హై ఎండ్‌ ఫోన్లు వీళ్లిద్దరి చేతిలో చూస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.