ఎర్ర నవ్వులు

ఆర్‌.నారాయణమూర్తి సినిమాలు సీరియెస్‌గా ఉంటాయి. ఆయన వెండి తెరపై మాట్లాడితే మినీ ఫైటు చేసినట్టే. బయట మాత్రం అంతా ‘శాంతం.. ప్రశాంతం’. ‘బ్రదర్‌..’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. మనస్ఫూర్తిగా మాట్లాడతారు. మొహమాటం లేకుండా బదులిస్తారు. కాసేపు కదిలిస్తే.. చిరు తుపాన్‌ వచ్చి వెళ్లినట్టు ఉంటుంది. మరోవైపు మన రాజేంద్రుడు. ఆయన పారితోషికం తీసుకుని సినిమాల్లో, తీసుకోకుండా బయటా.. నవ్వించేస్తుంటారు. ఆయన డైలాగ్‌ చెప్పక్కర్లెద్దు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చినా చాలు. కామెడీ పుట్టేస్తుంది. ఇక్కడ చూడండి.. నారాయణమూర్తి డీటీఎస్‌ సౌండ్‌తో మాట్లాడుతుంటే.. రాజేంద్రుడు ఎక్స్‌ప్రెషన్‌తో సరిపెట్టేశాడు. అయినా మనకు నవ్వాగడం లేదు కదా. అదే మరి వీరి టాలెంట్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.