భావోద్వేగానికి గురిచేసే పాట
ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
సేరువైనా సేదూ దూరాలే
నీదో నాదో తేలేలోగానే ఎదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోన.. సాగేనా..

‘కంచరపాలెం’లోని ఈ పాట ఎప్పుడు వింటున్నా ఏదో తెలియని భావోద్వేగానికి గురవుతాను. సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే ఈ పాట హృదయాన్ని హత్తుకుంటుంది. ‘‘తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో’’.. అన్న చరణాన్ని గమనిస్తే రచయిత విశ్వ ఎంత కష్టపడి రాశారో అర్థమవుతుంది. విశ్వ గతంలో రాసిన పాటలకు ఈ పాట పూర్తి భిన్నం. పాటలోనే కథను చెప్పడంలో విజయం పొందారు. గాయకుడు అనురాగ్‌ కులకుర్ణి చక్కగా ఆలపించారు. చరణంలో వచ్చే ‘‘ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో’’.. పదాలు వాటికి అర్ధాలు వెతకాలి అనిపించాయి.


- అంకాల శ్రీకాంత్, ఖమ్మం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.