రూపాయి పావలాతో ఏం చేయగలమో చెప్పిన చిత్రం

సామాజిక స్పృహ కథాంశంతో తెరకెక్కిన చిత్రాల్లో ‘అతడే ఒక సైన్యం’ నాకు చాలా ఇష్టం. చంటి అలియాస్‌ శ్రీధర్‌ పాత్రలో జగపతి బాబు నటన నన్ను బాగా ఆకట్టుకుంది. నటుడు సుమన్‌ జగపతికి అన్నయ్యగా కనిపించి అలరించాడు. బ్యాంకు మేనేజరు(రాఘవరావు)గా వ్యవహరించే తనని ఓ గ్యాంగ్‌ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి, కోట్ల రూపాయలు దోచేసిన దోషిగా నేరం మోపుతుంది. జర్మనీలో చదువుకునే శ్రీధర్‌కు ఈ విషయం తెలిసి భారత్‌కు వచ్చి పక్కా ప్లాన్‌తో ఆ గ్యాంగ్‌ను దెబ్బకొట్టి తన అన్న మీద మోపిన ఆరోపణలు తుడిచేస్తాడు.
ఇదీ ఈ చిత్ర కథాంశం. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ చంటిగా మారి తన ప్రణాళిక అమలు చేసేందుకు ముగ్గురు ఎంపిక చేసుకుంటాడు. వాü™్ల శివాజీ, అలీ, శ్రీనివాస్‌ రెడ్డి. ఈ నలుగురి మధ్య సాగే సన్నివేశాలు మనకు ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కానికి ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలో నేర్పుతాయి. నిజ జీవితంలో ఎంతో మంది బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి మోసమోపుతున్నారు. అలాంటి వారు అన్యాయం జరిగిందని బాధపడకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనేలా ఏం చేయోచ్చో తెలియజేస్తుంది. ఇలాంటి సీరియస్‌ కథతో నడిపిస్తూనే ఎమ్‌.ఎస్‌. నారాయణ, సునీల్‌తో మంచి కామెడీ పండించారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎమ్‌.ఎస్‌. అడిగే ‘నువ్వెవరు’ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని సునీల్‌ని చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. నువ్వు మనిషివా, పశువ్వా, పిట్టవా? అని కాదు నేను అడిగేది నువ్వెవరు.. డైలాగ్‌ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.


మోసం చేసే బ్యాంక్‌ యజమానిగా ప్రకాశ్‌రాజ్‌ తన విలనిజం చూపించాడు. రూపాయి పావలాతో చంటి తనను ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఎప్పటికీ బోర్‌ కొట్టవు. కథానాయిక నేహ నటన అమితంగా అలరించింది. ఈ సినిమాలో మరో ప్రత్యేకం సంగీతం. దర్శకుడు కృష్ణారెడ్డే స్వరాలు సమకూర్చడంతో సందర్భానికి తగిన సాహిత్యం రాబట్టుకోగలిగారు. అందుకే ‘నా పాట తేట తెలుగు పాట’, ‘ఆగస్టు పదిహేడు’ లాంటి సందర్భోచిత పాటలు బాగా ఆకట్టుకున్నాయి. అన్ని రకాలుగా అలరించే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తూ..

-సారథి, గురుభట్లగూడెంCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.