చిరస్థాయిగా నిలిచే ‘అతడు’

హేశ్‌బాబు మహర్షి సినిమాతో 25వ మైలురాయి చేరారు. మరో 75 చిత్రాల్లో నటించినా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘అతడు’. పార్థుగా పాత్రలో జీవించడం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలతో మాయ చేయడం ఇందుకు కారణం. సినిమా ప్రారంభం నుంచి శుభం వరకు వచ్చే ప్రతి సంభాషణ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నందు(మహేశ్‌), బాజిరెడ్డి(కోట శ్రీనివాసరావు), మహేశ్, తనికెళ్ల భరణి మధ్య వినిపించే మాటలు అద్భుతం. బ్రహ్మానందం కామెడీ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. మణిశర్మ సంగీతం మరవలేనిది. అటు నందూగా, ఇటు పార్థుగా రెండు విభిన్న పాత్రల్లో ఒదిగిపోయాడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. ‘హలో నేను బాజిరెడ్డిని చెప్పమ్మా, ఫోన్‌ శివారెడ్డికి ఇవ్వండి.. నాతో మాట్లాడితే శివారెడ్డితో మాట్లాడినట్టే.. నిన్ను కాలిస్తే శివారెడ్డిని కాల్చినట్టేనా? ఈ డైలాగ్‌ చాలా ఇష్టం. కథానాయకి త్రిష నటన చూపుతిప్పుకోనివ్వదు. బావ మరదళ్ల మధ్య ఉండే చిలిపితనం ఈ సినిమాలో ఉట్టిపడుతుంది. నందు పార్థు కాదని నాజర్‌ కుటుంబానికి తెలిసిన తర్వాత.. నేనూ వస్తాను అని త్రిష అనగానే నేనే వస్తా అని మహేశ్‌ చెప్పడం హీరోయిజాన్ని ప్రతిబింబిస్తుంది. సీబీఐ అధికారిగా ప్రకాశ్‌రాజ్‌ నటన వర్ణించలేనిది.‘నువ్వడిగావు కాబట్టి చెప్పలేదు నేను నమ్మాను కాబట్టి చెప్పాను’ డైలాగు విజిల్‌ కొట్టించదు కానీ విజ్ఞతను కలిగిస్తుంది. అప్పలా మీరంతా మోమాటంగా చెప్పాలా లాంటి సునీల్‌ కామెడీ టైమింగ్‌కి ఫిదా అయిపోయా. నటుల నటన కంటే మాటల వల్లే నాకు ఈ సినిమా నచ్చింది.

- రవి సారథి, చింతలపూడి



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.