సింగీతం శ్రీనివాస రావంటేనే ఒక ప్రయోగాల పుట్ట


అన్న ఎన్టీఆర్‌లా వైవిధ్యమైన పాత్రల్లో నటించడంలో బాలయ్య బాబు దిట్ట!!
ఈనాటి తరానికి ఓ బాహుబలి సినిమా ఎలాగో....1990వ దశకంలో చిన్నారులకు భైరవ ద్వీపం అలాగన్న మాట!
చక్కటి చందమామ కథలకు దృశ్య రూపం దాల్చితే అదే ‘భైరవ ద్వీపం’ చిత్రం.
అనగనగా ఒక రాజ్యం. రాజు కొడుకు చిన్నప్పుడే... అడవుల్లో పెరగడం. పొరుగు రాజుకి అందమైన కూతురు!
ఓ ద్వీపంలో మాంత్రికుడు, శాపాలు, పాపాలు, లిల్లీ ఫుట్స్‌....ఇలాంటి చక్కటి అంశాలను చిక్కని కథనంతో తయారయ్యింది ఈ సినిమా. నవరస భరితంగా, భారీ బడ్జెట్‌ రూపకల్పనతో...రూపొందిన క్రమంలో 1994 వేసవి కాలంలో విడుదలయిన ఈ సినిమా ఘన విజయం సాధించడంలో పాటలు కూడా తమ పాత్రను పోషించాయి. అందులో ‘‘నరుడా ఓ నరుడా..’’, ‘‘శ్రీ తుంబుర నారద..’’, ‘‘విరిసినది వసంతగానం..’’లాంటి పాటలు వినసొంపుగా ఉంటాయి. ఇందులో రోజా, రంభ, బాబు మోహన్‌ల నటన కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ ఈటీవీలో వస్తుంటే ఆనాటి చిన్నారులతో పాటుగా ఆబాలగోపాలన్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది.

పవని భాను చంద్రమూర్తి,
చీరాల,
ప్రకాశం జిల్లా.  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.