ముసలితాత ముడత ముఖమంటే ఇష్టం

రామజోగయ్యశాస్త్రి ఏ మూడ్‌లోకెళ్లి ఈ పాట రాశారో కానీ ఓ అద్భుతాన్ని కాగితంపై సృష్టించారు. సినిమాలో ఓ సన్నివేశం..అందుకుతగినట్లుగా వచ్చే పాట ఇది. ‘భరత్‌ అను నేను’ కథాపరంగా కొరటాల శివ మనసుదోస్తే.. సాహిత్యపరంగా చక్కటి పాటలతో రామజోగయ్య సినీప్రియుల మనసుదోచారు. సినిమాలో పాటలన్నీ ఒకెత్తయితే అందులోని ‘‘వచ్చాడయ్యో సామీ’’ గీతం మరో ఎత్తు. ఆ పాటలో ‘‘ముసలి తాత ముడత ముఖం మురిసిపోయెనే’’ అనే పల్లవితో సాగే చరణమంతా వర్ణించడానికి వీలులేని గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. ఈ గీతంలోని ‘‘ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమ ఇది ఈ నాడు వెల వెల బోతే ప్రాణం అంతా చినబోతోంది’’ అంటూ రాయలసీమ పరిస్థితిని, అక్కడి గ్రామాల పరిస్థితిని అద్భుతంగా వర్ణిస్తూ నేటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుండే పాట. అందుకే ఈసినిమా నాకెంతో నచ్చింది.

- రాజేష్‌ కుమార్‌.. అశ్వారావుపేట(ఖమ్మం)



మీరు చూసిన సినిమాల్లో ఎన్నో సన్నివేశాలు, పాటలు, డైలాగులు మీ మనసులో ముద్రవేసుకుని ఉంటాయి. వాటిని అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీకు నచ్చిన సినిమాల గురించి కానీ, వాటిలో మీకు నచ్చిన అంశాల గురించి కానీ ఎందుకు నచ్చిందో విశ్లేషణాత్మకంగా రాసి, మాకు పంపించండి. మీ ఫొటోతో వాటిని ప్రచురిస్తాం. మా చిరునామా: sitaradesk@sitara.net


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.