అమ్మానాన్నలు గుర్తొచ్చారు...

‘భరత్‌ అను నేను’ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్‌లివి. ‘‘తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్‌ చేయడానికి ట్రై చేస్తే మీకు రాచరికం, రాజులు గుర్తొచ్చారు. కాని నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మానాన్న గుర్తొచ్చారు’’ అంటూ ‘మహేశ్‌ బాబు’ అనే డైలాగ్‌ చాలా బాగుంటుంది. తల్లితండ్రుల పెంపంకం వల్లనే పిల్లలకు బాధ్యత అలవడుతందనే సందేశం ఈ డైలాగ్‌లో ఉంది. మరో సన్నివేశంలో ‘‘జనం పట్ల ఎందుకంత హార్‌్్షగా ఉన్నారు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా?’’ అని విలేకర్లు ప్రశ్నించే సన్నివేశం. దానికి సమాధానంగా మహేష్‌ ‘‘అంతఃకరణ శుద్థితో’’ అని సమాధానం ఇస్తాడు మహేశ్‌బాబు. తనలోని తప్పుని ఎత్తి చూపిన విలేకరికి తప్పుని సరిచేసుకున్నాని సమాధానం చెప్పినట్లుగా ఉంటుంది ఆ డైలాగ్‌. ఇలాంటి ఎన్నో డైలాగులు ఈ చిత్రంలో అలరిస్తాయి.
- బొల్లం కార్తీక్‌...రామంతపూర్‌ (హైదరాబాద్‌)


మీరు చూసిన సినిమాల్లో ఎన్నో సన్నివేశాలు, పాటలు, డైలాగులు మీ మనసులో ముద్రవేసుకుని ఉంటాయి. వాటిని అందరితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీకు నచ్చిన సినిమాల గురించి కానీ, వాటిలో మీకు నచ్చిన అంశాల గురించి కానీ ఎందుకు నచ్చిందో విశ్లేషణాత్మకంగా రాసి, మాకు పంపించండి. మీ ఫొటోతో వాటిని ప్రచురిస్తాం. మా చిరునామా: sitaradesk@sitara.net


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.