అజయ్‌గా కనిపించి ‘బిందాస్‌’ అనిపించుకున్నాడు

నా
కు నచ్చిన కథానాయకుల్లో మంచు మనోజ్‌ ఒకరు. తెరపై ఆయన పేరు కనిపిస్తేనే ఏదో సంతోషం. ఆయన దర్శనమిస్తే అదో ఆనందం. ఎందుకంటే మనోజ్‌కు మరోపేరు ఉల్లాసం..ఉత్సాహం. ‘దొంగ దొంగది’ చిత్రం నుంచి ఆయన్ను అభిమానిస్తున్నాను. తొలి సినిమాతో మెప్పించిన మనోజ్‌ ‘శ్రీ’, ‘రాజుభాయ్‌’, ‘నేను మీకు తెలుసా’,‘ప్రయాణం’తో పదిలమైన స్థానం సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన ‘బిందాస్‌’తో చెరగని ముద్ర వేశాడు. నాకు బాగా ఇష్టమైన సినిమా జాబితాలో ‘బిందాస్‌’ చేరిపోయింది. ఈ చిత్రం చూసి పదేü˜్లౖన సందర్భంగా జ్ఞాపకాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను..


- మనోజ్‌ మీద అభిమానంతో ఎప్పటిలానే మొదటి ఆటకు వెళ్లాను. మంచు మనోజ్‌ కుమార్‌ టైటిల్‌ పడగానే అరుపులు.. కేకలు.. విజిల్స్‌. ఎలా ఉంటుందో? ఎలా ఉండబోతుందో? అనే ఆసక్తి సీట్లో కూర్చోనివ్వలేదు. కథ నడుస్తుంది. మనోజ్‌ నటన ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా యాక్షన్, కామెడీ సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం బావుంది. ఇప్పటికీ టీవీలో వస్తే అసలు మిస్‌ అవ్వను. మనోజ్‌తోపాటు గిరిజ పాత్రలో కనిపించిన నాయిక షీనా నటన ఆకట్టుకుంది. ఈ ఇద్దరి మధ్య నడిచే సీన్స్‌ ఎంతగానో ఆకర్షించాయి. వెన్నెల కిశోర్‌ కామెడీ పొట్ట చెక్కలు చేసింది. భువనచంద్ర, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శశి సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇదంతా జరిగి అప్పుడే పది సంవత్సరాలైందా అనిపిస్తుందా! 2010 ఫిబ్రవరి 5న థియేటర్లలో అడుగుపెట్టి ‘అజయ్‌ గాడి విజయ గాధ’ అంటూ ‘బిందాస్‌’ అనిపించుకున్నాడు మనోజ్‌. ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. గతకొంతకాలంగా విరామం ప్రకటించిన మనోజ్‌ త్వరలోనే కొత్త సినిమాతో వచ్చి పూర్వ వైభవాన్ని అందుకోవాలని ఆశిస్తూ...


- రవి, ఏలూరు, పశ్చిమగోదావరి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.