‘క్షణ క్షణం’ బ్రహ్మానందమే!
చాలా వరకు రామ్‌గోపాల్‌ వర్మ, బ్రహ్మానందం కలయికలో వచ్చిన సినిమాల్లో హాస్యం గుర్తుకు వస్తే తప్పనిసరిగా ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ‘క్షణ క్షణం’, ‘అనుకోకుండా ఒక రోజు’. ఈ రెండు సినిమాల్లో బ్రహ్మానందం నటన చూస్తే నవ్వలు ఆపుకోలేం.. నాకు నచ్చిన ఆ చిత్రాల్లోని సన్నివేశాలు..

* రాఘవా! ఇలారా
ఏంటివీ? అంటూ మొదలవుతుంది ‘క్షణ క్షణం’లో.....!
సీరియస్‌గా ఉంటూ మనల్ని సునిశితంగా నవ్వుతూ ఉండేలా చేయడంలో మన బ్రహ్మ అమలిన హాస్యానికి చిరునామా!
పాపం మన షాపుకెలాంటి వారొస్తారని రాఘవని ప్రశ్నిస్తా, డీసెన్సీ గురించి ఘాటుగా క్లాసు పీకిన టైంలో మురికిగా బట్టలు వేసుకుని వెంకి, వెనకే శ్రీదేవి వస్తారు!
బట్టలు పడి పోతా ఉంటే.... ‘‘నేను పెడతా గదా’’!
అని మళ్ళీ అదే సీన్‌లోచెయ్యి అడ్డం పెట్టి దుస్తులు కింద పడి పోకుండా చూస్తాడు!
బొమ్మ తల మీద జుట్టు ఊడిపోతే.....‘‘నేను పెడతా గదా!’’ అంటూ అసహనంతో నవ్విస్తాడు.
వెంకటేష్‌ బొమ్మని బ్రహ్మీ మీదకి తోసి మరీ కవ్విస్తాడు. ఉన్నది కాసేపయినా ఇప్పటికీ..... ఆ సినిమా పేరు చెప్తే బ్రహ్మీ సీరియస్‌ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్తారు.


* ఇక నెల్లూరు పెద్దారెడ్డిగా ఆయన ‘అనగనగా ఒక రోజు’లో పండించిన హాస్యం ఈరోజు కూడా టీవీల్లో చూసి అదే పదిగా నవ్వులు పూయిస్తోంది. గెటప్‌ గానీ, ముఖంలో ఫీలింగ్స్‌గాని మాములుగా పెట్టడు.


* అందుకే రాము స్కూల్లో కొన్నాళ్ళు గడిపాడు. ‘మనీ మనీ మనీ’ సినిమాలో.... పాటలు సైతం పెట్టి నిర్మాతగా వర్మ, బ్రహ్మానంద కామెడీ మరో స్టయిల్‌లో అందించారు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ బ్రహ్మానందం - రామ్‌ల కాంబినేషన్‌ అదుర్స్‌ అంటాను.


- పవని భానుచంద్ర మూర్తి, చీరాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.