మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు!


నాకు ఇష్టమైన నటుల్లో నూతన్‌ ప్రసాద్‌ ఒకరు. ఆయన నటించిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రం ఇటీవలే చూశాను. చిరంజీవి, మోహన్‌ బాబు కథానాయకులుగా తెరకెక్కిన చిత్రమిది. పోలీసు అధికారిగా ప్రసాద్‌ తీరు నన్నెంతో ఆకట్టుకుంది. ‘మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు’ అంటూ తను చెప్పిన డైలాగ్‌ ఎంతోగానో అలరించింది. అయితే ఈ పాత్ర వినోదాత్మకంగా ఉన్నప్పటికి ఆలోచిపంజేస్తుంది. ఈ సంభాషణ విన్నప్పుడు, చూసినప్పుడు ప్రస్తుతం మన దేశం ఇదే పరిస్థితుల్లో ఉంది కదా అనిపించింది. 1980ల్లో విచ్చలవిడిగా సాగే వ్యభిచారం ఉద్దేశించి ఈ మాటలు ఉంటాయి. ‘వ్యభిచారం అనేది చాలా ఎక్కువైపోతుంది. లాడ్జిలోని ప్రతి మంచం, దుప్పటి, తలగడ పరిశీలించి ఆడపిల్ల కనిపిస్తే చాలు వాహనం ఎక్కించండి’ అంటూ నూతన్‌ ప్రసాద్‌ చెప్పిన ఈ డైలాగ్‌ కరోనాకు అన్వయించుకోవచ్చు అనే భావన కలిగింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. కేవలం మన దేశం మాత్రమే కాదు యావత్‌ ప్రపంచం ఈ మహమ్మారికి భయపడుతోంది. ఇలాంటి వాతావరణంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ...


-నాని, ఏలూరు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.