మానవ సంబంధాలకు అద్దం పట్టే సినిమా

‘రాజా’ చిత్రంలో పాటలు, సన్నివేశాలు అంటే నాకెంతో ఇష్టం. సినిమాలో ఒకటి, రెండు సన్నివేశాల్లో కన్నీరుని ఆపడం కష్టం. సమయాన్ని, పరిస్థితులను బట్టి ఎలా వ్యవహరించాలో ‘రాజా’ చిత్రం చెబుతుంది. వెంకటేష్‌ నటన సన్నివేశాలకు తగినట్టు ఆకట్టుకుంటుంది. ఎదుటివారు ఎదగాలనే కోరుకోవాలి తప్ప వారి కీడును కోరుకోకూడదనే అనే అంశాన్ని సినిమా ద్వారా చెప్పిన తీరు నన్నెతో ఆకట్టుకుంది. వెంకటేష్‌ (రాజా)కు సౌందర్య (అంజలి) అంటే చెప్పలేనంత ప్రేమ. కానీ దాన్ని పైకి వ్యక్తం చేయలేడు. ఈలోగా సౌందర్యకు బావ వరసైన అబ్బాస్‌ (సంజయ్‌) విదేశాల నుంచి రావడం, అతడితో ఆమెకు పెళ్లి ఖాయమవడం జరుగుతాయి. ఈ విషయం తెలిసిన వెంకటేష్‌ తనలో తాను బాధపడుతూనే అబ్బాస్‌తో కలివిడిగా ఉంటుంటాడు. ఈ సందర్భాలతో వెంకటేష్‌ తన హుందా అయిన నటనతో ఆకట్టుకుంటాడు. ఓ దశతో రాజాను ఇంట్లోంచి బయటకు పంపించే సన్నివేశం కన్నీరు తెప్పిస్తుంది. మానవ సంబంధాలు కరవైపోతున్న నేటి సమాజానికి ఇటువంటి చిత్రాలు ఎంతో అవసరం. (నేటితో ఈ చిత్రం 21 ఏళ్లు పూర్తి చేసుకుంది).


- ఆర్‌.రవిసారధి, ఎర్రగడ్డ, హైదరాబాద్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.