శోభన్‌బాబు ప్రత్యేకత
article image
గౌతమీ వారి నిర్దొషి (1967) చిత్రాన్ని దాదా మీరాశీ డైరెక్టు చేశారు.‌ అప్పుడు ఆయన శివా‌జీ‌గ‌ణే‌శన్‌ తో ఒక తమిళ చిత్రం కూడా చేస్తు‌న్నారు.‌ రామా‌రావు, సావిత్రి దగ్గర తీసు‌కున్న డేట్స్‌ వేళకి తమిళ చిత్రం కూడా వుంది.‌ ఒక్క‌రోజు ఇబ్బంది దాదా మీరాశీ షూటింగ్‌ ఆరం‌భా‌నికి ముందు‌వచ్చి, రామా‌రావు గారికి తన విషయం చెప్పాడు.‌ ఈ షూటింగ్‌ కాన్సిల్‌ చేస్తే మీ డేట్స్‌ పోతాయి.‌ తమి‌ళ‌చిత్రం దగ్గర నా అవ‌సరం వుంది.‌ దయ‌చేసి, ఈనాడు చెయ్య‌వ‌ల‌సిన రెండు దృశ్యాల్ని మీరు డైరెక్టు చెయ్య‌వ‌ల‌సిం‌దిగా కోరు‌తు‌న్నాను.‌ అన్నాడు ఎందుకూ? ఎంతో అను‌భ‌వ‌శాలి కె.‌వి.‌రావు మీ సహ‌కార దర్శ‌కుడు.‌ అతని చేత చేయిం‌చండి.‌ మేము నటిస్తాం’’.‌ అని రావుని ప్రొత్స‌హించి ఆ రెండు దృశ్యాలూ నటిం‌చారు రామా‌రావు, సావిత్రీ.‌

article image
రాఘ‌వా‌చార్య ప్రభావం
యస్‌.‌వి.‌రంగా‌రావు తన‌మీద బళ్లారి రాఘ‌వా‌చార్య ప్రభావం ఎక్కువ−‌ అని చెప్పే‌వారు.‌ ‌‘‌‘నేను రాఘ‌వా‌చార్య నటిం‌చిన సాంఘి‌కాలు, పురా‌ణాలు, ఇంగ్లీషు నాట‌కాలూ అన్నీ చూసే‌వా‌డిని.‌ ఆయన డైలాగ్‌ చెప్పే విధానం, టైమింగ్‌ అన్నీ బాగా పరి‌శీ‌లిం‌చే‌వా‌డిని.‌ డైలాగ్‌ మాడ్యు‌లే‌షన్‌ రాఘ‌వని చూసి నేర్చు‌కు‌న్నాను.‌ ‌‘సంతానం’‌ సిని‌మాలో నా పాత్ర గుడ్డి‌వాడి పాత్ర.‌ అందు‌కని అంధు‌డైన ఒక బిచ్చ‌గా‌డిని చూసి, అతని ప్రవ‌ర్త‌నని, విన్యా‌సాల్నీ పరి‌శీ‌లించి, ఆ ధోర‌ణిలో నటిం‌చాను’‌’‌ అని రంగా‌రావు చెప్పారు ఒక సంద‌ర్భంలో.‌

article image
రెండు కంఠాల పాట!‌
‌‘‌‘మూగ‌నోము’‌’‌ (1969) సిని‌మాలో ‌‘‌‘ఊరు మారినా, ఉనికి మారునా’‌’‌ అనే పాట ఉంది.‌ ఘంట‌సాల గాత్రంతో విని‌పి‌స్తుంది.‌ కాని గ్రామ ఫోన్‌ రికా‌ర్డులు రెండు కంఠా‌లతో రెండు వచ్చాయి.‌ ఒకటి ఘంట‌సాల −‌ రెండోది పి.‌బి.‌శ్రీని‌వాస్‌.‌ బహుశా శ్రీని‌వా‌స్‌తో మొదట పాడించి, తిరిగి ఘంట‌సా‌లతో పాడించి వుంటారు.‌ మొదట శ్రీని‌వాస్‌ రికార్డు వచ్చేసి వుంటుంది.‌ తర్వాత ఘంట‌సా‌లది వచ్చి వుంటుంది.‌

article image
గృహ‌లక్ష్మి పాటలు:‌
రోహిణి పేరిట హెచ్‌.‌ఎమ్‌.‌రెడ్డి తీసిన ‌‘గృహ‌లక్ష్మి’‌ (1938) కార్తీ‌కేయ ఫిల్మ్‌ స్టూడి‌యోలో (మద్రాసు) నిర్మాణం జరి‌గింది.‌ దీనికే వేల్‌పి‌క్చర్స్‌ అన్న పేరు కూడా వుంది.‌ కె.‌రామ్‌నాథ్, ఎ.‌కె.‌శేఖ‌ర్‌లు ఆరు ‌నె‌లల పాటు బొంబా‌యిలో వుండి శిక్షణ పొంది వచ్చి, కార్తి‌కే‌యలో పని‌చే‌శారు.‌ ‌‘గృహ‌లక్ష్మి’‌ పాట‌లన్నీ షూటిం‌గ్‌తో పాటే రికార్డు చేశారు.‌ కాస్త దూరంలో ఆర్కెస్ట్రా పెట్టి ఒక మైకు వారికి, ఒక మైకు పాడే వారికీ పెట్టి రికార్డు చేశాను.‌ అప్ప‌టికి ప్లే బాక్‌ విధానం బొంబా‌యికి వచ్చిం‌ది‌గాని, దక్షి‌ణా‌నికి రాలేదు.‌ 1939లో వచ్చిన ‌‘వందే‌మా‌తరం’‌ సిని‌మాకి కొన్ని పాటలు ముందే రికార్డు చేశాము.‌ ప్లేబాక్‌ యంత్రాలు ఇంకా రాలేదు గనక, ప్రొజె‌క్టర్స్‌ తెచ్చి దాంట్లో పాట విని‌పిస్తూ నటులు పెద‌వులు కద‌లిస్తూ వుంటే షూట్‌ చేశాము’‌’‌ అని రికా‌ర్డిస్టు కళా దర్శ‌కుడు ఎ.‌కె.‌శేఖర్‌ చెప్పాడు.‌

article image
అదీ ఘంట‌సాల వినయం!
సురేష్‌ వారు తీసిన జీవన తరం‌గాలు (1973) చిత్రా‌నికి జె.‌వి రాఘ‌వులు సంగీత దర్శ‌కుడు.‌ అందు‌లోని నేప‌థ్య‌గీతం ‌‘‌‘ఈ జీవన తరం‌గా‌లలో’‌’‌ అన్న పాటకి స్వర‌క‌ల్పన చేశాడు.‌ తన గురువు గారైన ఘంట‌సాల గారి‌చేత పాడిం‌చాలి! భయం! ఎలాగో ధైర్యం తెచ్చు‌కుని, గురువు గారిం‌టికి వెళ్లి, పాటకి వరస కల్పిం‌చా‌నని, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అను‌కు‌న్నది విని‌పి‌స్తా‌ననీ మనవి చేశాడు.‌ ‌‘‌‘నువ్వెం‌దుకు బాబూ −‌ ఇక్క‌డికి రావడం? నేను సురేష్‌ ఆఫీ‌సుకి వస్తాను.‌ అక్కడే విని‌పించు.‌ ఏం భ‌య‌ప‌డకు.‌ మామూలు గాయ‌కు‌డికి విని‌పిం‌చి‌నట్టే విని‌పించు.‌ గురు‌వును పక్క‌న‌పెట్టు’‌’‌ అని, సురేష్‌ వారి ఆఫీ‌సుకి వెళ్లి పాట‌విని, ఎంతో ప్రోత్సా‌హిం‌చారు’‌’‌ రాఘ‌వులు బాబూ, బాగా చేశావు.‌ అంత బాగానూ నేను పాడ‌తాను.‌ ఈ పాట ప్రసిద్ధి పొందు‌తుంది’‌’‌ అని ఆశీ‌స్సులు అందించారు’‌’‌ నాకు శిష్యు‌డైన రాఘ‌వులు మంచి వర‌స‌క‌ల్పించి, నాకు పేరు తెచ్చాడు’‌’‌ అని రామా‌నా‌యు‌డికి చెప్పి సంతో‌షిం‌చారు ఘంట‌సాల.‌

article image
శుభం...మొహాలు కడుక్కోండి!
కె.‌వి.‌రెడ్డి వాహి‌నికి తీసిన గుణ‌సుం‌ద‌రి‌కథ (1949) మోగిం‌చిన విజ‌య‌ఢంకా ఇంతా అంతా కాదు.‌ రాజ‌మం‌డ్రి‌లోని ఒక థియే‌ట‌ర్‌లో రాత్రి మూడు ఆటలు కూడా ప్రద‌ర్శిం‌చే‌వారు.‌ పైగా ఆక‌ర్షణ ఏమి‌టంటే చివరి సినిమా పూర్త‌య్యే‌స‌రికి తెల్ల‌వారు 5 గంట‌ల‌య్యేది.‌ అంద‌రికీ థియే‌టర్‌ వారు పళ్లు తోము‌కునే పుల్లలు, నీళ్లు అంద‌జే‌సే‌వారు.‌ ‌‘‌‘పక్కనే ఉన్న హోటల్‌ తెరి‌పించి ఉంచాము.‌ ముఖాలు కడు‌క్కుని.‌.‌కాఫీలు తాగి వెళ్ల‌వ‌చ్చును.‌ అని ప్రక‌ట‌నలు ఇచ్చే‌వారు.‌

article image
నటీ‌న‌టు‌లం‌దరూ తాము చేస్తున్న చిత్రాల గురించి, ఒప్పు‌కున్న కథల గురించి ఇంట్లో‌వా‌ళ్లకి చెప్తారు.‌ అక్కి‌నే‌నికి ఈ అల‌వాటు ఎక్కువ.‌ కాని శోభ‌న్‌బాబు తాను ఏ షూటిం‌గ్‌కి వెళ్లి‌నది, ఒప్పు‌కున్న సినిమా ఏమిటి−‌ అన్న విష‌యాలు ఏనాడూ ఇంట్లో చర్చిం‌చ‌లేదు.‌ ‌‘‌‘నేను షూటిం‌గ్‌కి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఎక్కడ షూటింగు, ఎవరి షూటింగు? లాంటి విష‌యాలు కూడా ఇంట్లో చెప్పడం అల‌వాటు లేదు.‌ వాళ్లకి అన‌వ‌సరం అని నా అభి‌ప్రాయం’‌’‌ అని చెప్పే‌వాడు
శోభ‌న్‌బాబు.‌
article image
సంగీతం కాపీ కాదు
చిత్తూరు నాగయ్య నటిం‌చిన తొలి‌చిత్రం ‌‘గృహ‌లక్ష్మి (1938) ఇందులో ఆయన పాడిన పాటలు దాదాపు హిందీ వర‌సల కాపీ.‌ సంగీత దర్శ‌కుడు, ప్రభు సత్య‌నా‌రా‌యణ ఆయన హీరోగా నటించి, సంగీత దర్శ‌కత్వం చేసిన తొలి చిత్రం ‌‘వందే‌మా‌తరం’‌ (1939) ఇందులో నాగయ్య తానుగా చేసిన వాటి కంటే, హిందీ పాటల వర‌సలు కాపీ చేసి‌నవి వున్నాయి.‌ తర్వాత సంగీతం చేసిన సినిమా ‌‘సుమం‌గళి’‌ (1940) ఇందులో అన్ని పాటలూ ఆయన సొంతం‌గానే చేశారు.‌ ఆ పాటలు ప్రసిద్ధి పొందాయి.‌ ముఖ్యంగా ఆయనే పాడిన ‌‘‌‘పసుపు కుంకుమ బాలా జన్మ హక్కు కాదా’‌’‌ కుమారి పాడిన ‌‘రాధ‌నిటు దయ‌మాలి విడచి’‌’, ‌‘వస్తాడే మా బావ’‌ పాటలు ఎంతో ఆద‌రణ పొందాయి.‌ ఆ రోజుల్లో పాట రాని వాళ్లు కూడా ‌‘వస్తాడే మా బావా’‌ పాటని పాడేస్తూ వుండే‌వారు’‌’‌ సర‌ళ‌మైన పాట.‌ ‌‘‌‘కాపీ పాటల కంటే సొంతంగా చేస్తే ప్రసిధ్ధి పొందు‌తాయి’‌’‌ అని ఆయన చెప్పే‌వాడు.‌

article image
మోహన కళ్యాణం
ఒక‌సారి సంగీత దర్శ‌కుడు రాజే‌శ్వ‌ర‌రా‌వును ‌‘‌‘మీరు ఎక్కువ పాటలు మోహన, కళ్యాణి రాగాల్లో చేశారు.‌ కారణం ఏదైనా వుందా?’‌’‌ అని అడి‌గితే ఆయన చెప్పి‌నది:‌ ‌‘‌‘రెండు రాగాలూ వేర్వేరు స్వరా‌ల‌యినా రెండిం‌టినీ కలిపి పాట చెయ్య‌డా‌నికి అను‌వుగా ఉంటాయి.‌ ఎంతో హాయిని ఇచ్చే ఆ రాగా‌లని మనకి అంద‌జే‌సిన నాటి మహా‌ను‌భా‌వు‌లకి వంద‌నాలు! శృంగార పరం‌గానూ ప్రేమమయం గాను ఉండే పాట‌లని ఆ రాగాల్లో చేస్తే, హృద‌యో‌ల్లా‌సంగా, తేలి‌కగా, పాడు‌కో‌డా‌నికి వీలుగా ఉంటాయి.‌ నేను రెండు రాగ‌లనీ కలిపి పాటలు చేసాను.‌ భీంప‌లాస్‌ కూడా ఇష్ట‌ప‌డ‌తాను.‌ ఈ రాగంతో శృంగా‌రాన్ని విషా‌దాన్నీ కూడా పలి‌కిం‌చ‌వచ్చు.‌ అయినా, ఏ రాగం తీసు‌కున్నా దాన్ని మలు‌చు‌కునే విధానం తెలిస్తే చాలు! విషా‌దా‌నికి మాత్రమే ఎక్కు‌వగా వాడే శివ‌రం‌జని రాగంలో నేను ‌‘బాల‌నా‌గమ్మ’‌లో (1942) ‌‘‌‘నా సొగ‌సే‌కని యముడే దాసుడు కాడా’‌’‌ అనే శృంగార గీతం చేశాను’‌’‌.‌

article image
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.