సినిమా భాషను సరళీకరించిన సముద్రాల
( సము‌ద్రాల రాఘ‌వాచా‌ర్య‌గారి వర్ధంతి మార్చి 16−‌ సంద‌ర్భంగా )
article image‌‘కన‌క‌తార’‌ (1937) సిని‌మాకి ముందు సినిమా భాష ఎక్కు‌వగా గ్రాంథి‌Å‌కంగా వుండేది.‌ ‌‘కన‌క‌తార’‌తో సినిమా ప్రవేశం చేసిన సము‌ద్రాల వెంకట రాఘ‌వా‌చార్య −‌ భాషని సడ‌లించి, సవ‌రించి, సర‌ళీక‌రించి సంభా‌ష‌ణలు రాసి ఒక విప్లవం లాంటిది సృష్టించి, తొలి చిత్రం‌తోనే పేరు తెచ్చు‌కు‌న్నారు.‌ ‌‘ద్రౌపదీ వస్త్రా‌ప‌హ‌రణం’‌ (1936) తీయిం‌చిన హెచ్‌.‌ఎమ్‌.‌రెడ్డి, ‌‘కన‌క‌తార’‌నీ నిర్మిం‌ప‌జే‌శారు.‌ నిర్మా‌తలు సర‌స్వతీ టాకీస్‌.‌ దర్శ‌కుడు హెచ్‌.‌వి.‌బాబు.‌ చందాల కేశ‌వ‌దాసు రాసిన ‌‘కన్క్‌‌తార’‌ నాటకం స్ఫూర్తి. సినిమా పేరుని విడ‌గొట్టి కన‌క‌తా‌రగా మార్చారు.‌ సినిమా, ప్రేక్షక వర్గాన్ని నిరూ‌త్సాహ పర‌చగా, సము‌ద్రాల పేరుకి ఢోకా రాలేదు.‌ సంస్కృ‌తాం‌ధ్రాలు క్షుణ్ణంగా అభ్య‌సించి, భారత భాగ‌వ‌తాది పురా‌ణాలు జీర్ణిం‌చు‌కుని, ప్రజా‌చిత్ర, పత్రిక సంపా‌దక వర్గంలో పని‌చే‌సిన అను‌భవం తప్ప, నాటి సినిమా రచ‌యి‌త‌ల్లాగా రంగ‌స్థల నాట‌కాలు రాసి సినిమా రంగా‌నికి రాలేదు ఆచార్య.‌ హెచ్‌.‌ఎమ్‌.‌రెడ్డి, రోహిణి పిక్చర్స్‌ పేరుతో సాంఘికం ‌‘గ]ృ‌హ‌లక్ష్మి’‌ (1938) ఆరం‌భిస్తూ సము‌ద్రాల గారిని సాంఘిక చిత్ర రచ‌యి‌తని చేశారు.‌ ఈ సిని‌మాలో పాటలు, మాటలూ ఆయ‌నవే.‌ అయితే, రోహిణి నుంచి విడి‌పో‌యిన భాగ‌స్వా‌ములు వాహిని ఆరం‌భించడంతో రాఘ‌వా‌చార్య కూడా వాహి‌నిలో చేరారు.‌
‌‘‌‘వాహిని సంస్థలో నాకు గొప్ప అను‌భవం.‌ సాహితీ ప్రియులు, ఉత్త‌మా‌భి‌రు‌చి‌గల వారితో సత్సంగం.‌ బి.‌ఎన్‌.‌రెడ్డి, కె.‌రామ్‌నాధ్, కె.‌వి.‌రెడ్డి, కమా‌లా‌కర కామే‌శ్వ‌ర‌రావు అందరూ సినిమా మీద మంచి అవ‌గా‌హన వున్న‌వారు.‌ బి.‌ఎన్‌.‌ దర్శ‌క‌త్వంలో ఆరం‌భ‌మైన ‌‘వందే‌మా‌తరం’‌ (1939) సిని‌మాకి నేను మాటలు, పాటలూ రాశాను.‌ రామ్‌నాథ్‌ స్క్రీన్‌ప్లే తయారు చెయ్య‌డంలో ఉద్దం‌డుడు.‌ ఆయన చలవ వల్లనే మేము స్క్రీన్‌ ప్లే అంటే ఏమిటో తెలు‌సు‌కో‌గ‌లి‌గాము’‌’‌ అని రాఘ‌వ‌చార్య చేప్పే‌వారు.‌ ‌‘వందే‌మా‌తరం’‌ విజయం సాధిం‌చ‌డంతో ‌‘సుమం‌గళి’‌ తీసింది వాహిని సంస్థ.‌ తర్వాత ‌‘దేవత’‌ ‌‘భక్త‌పో‌తన’‌ వచ్చాయి.‌ పని వున్నా లేక‌పో‌యినా ఆచార్య నెల జీతం మీద ఉండే వారు గనక ఇతర చిత్రా‌లకి పని చేసే అవ‌కాశం లేదు.‌
ముందు మూడు సాంఘి‌కాలు తీసినా, నాలు‌గోది భక్తి రసా‌త్మ‌క‌మైన పోతన.‌ రాఘ‌వా‌చార్య పాటలు, మాటలూ అత్యంత అద్భు‌తంగా రాశారు.‌ 1946లో వచ్చిన ‌‘స్వర్గ‌సీమ’‌ ఆయన పేరుతో వచ్చినా, ఎక్కువ సంభా‌ష‌ణలు చక్రపా‌ణివే ఉన్నట్టు నాగి‌రెడ్డి చెప్పారు.‌ కథ చక్రపా‌ణిది కావ‌డంతో, అందు‌లో‌వున్న సంభా‌ష‌ణ‌లనే వాడు‌కు‌న్నారు.‌ ‌‘యోగి‌వే‌మన (1947)కి రాఘ‌వా‌చార్య వేదాంత పర‌మైన సంభా‌ష‌ణలు రాసి, ఘన‌త‌కె‌క్కారు.‌ ఆ సిని‌మా‌లోని, దృశ్యా‌లకు అను‌గు‌ణంగా ఆచార్య రాసిన మాటలు ‌‘నభూతో నభ‌వి‌ష్యతి’‌ అని‌పి‌స్తాయి.‌
చిత్తూరు నాగ‌య్యకి పోతన, వేమన, త్యాగయ్య పాత్రలు ఎంత ప్రసిద్ధి పొందాయో, అంత ప్రసిద్ధీ పొందాయి ఈ మూడు చిత్రాల రచ‌నలూ.‌ సినిమా వైభ‌వా‌నికి సాహితీ విలు‌వలు పెంచాయి ఈ మూడు చిత్రాలూ.‌ ఆ తర్వాత సము‌ద్రా‌లకి పురాణ చిత్రాల రచ‌యి‌తగా ముద్ర పడింది.‌ ‌‘త్యాగయ్య’‌ (1946)కి ముందే ఆయన వాహిని నుంచి విడి‌వడి, పల్నా‌టి‌యుద్ధం, రత్న‌మాల మొద‌లైన చిత్రా‌లకి రచ‌యి‌తగా పని‌చే‌శారు.‌
పల్నా‌టి‌యుద్ధం (1947) కాలం‌లోనే సము‌ద్రా‌లకి, రామ‌కృ‌ష్ణ‌శాస్త్రితో వున్న మైత్రి అధి‌క‌మైంది.‌ చిత్రాల రచ‌న‌లతో ఆచా‌ర్యులు విరామం లేకుండా పని చెయ్య‌డంతో తనకి పాటల విష‌యంలో సహాయం చెయ్య‌మని శాస్త్రిని అడి‌గారు.‌ రామ‌కృ‌ష్ణ‌శాస్త్రి పాటలు రాసి ఇచ్చే‌వారు సము‌ద్రాల తను రాసి‌న‌ట్టు‌గానే కంపె‌నీ‌లకి అంద‌జే‌సే‌వారు.‌ శాస్త్రికి డబ్బు ఆయనే ఇచ్చే‌వారు.‌ ‌‘‌‘నాకు కాలం అవ‌సరం, అన్న‌గా‌రికి (మల్లాది) డబ్బు అవ‌సరం.‌ అంచేత రాయిం‌చు‌కో‌వ‌లసి వచ్చింది.‌’‌’‌ అని సము‌ద్రాల చెప్పే‌వారు.‌
‌‘‌‘ఈ పాట మీరు రాసిందే కదా?’‌’‌ అని రామ‌కృ‌ష్ణ‌శాస్త్రిని అడి‌గితే ‌‘‌‘నా పేరు లేని‌దేదీ నాది కాదు’‌’‌ అనే వారు ఆయన.‌ ‌‘పల్నాటి యుద్ధం’‌లో ‌‘‌‘ఈ కుహూ‌రాత్రి నారాజు వేంచే‌యునో’‌’, ‌‘రత్న‌మాల’‌లో ‌‘స్వాగ‌త‌మోయి మదనా’‌ మొద‌లు‌కొని విప్రనా‌రా‌యణ, దేవ‌దాసు, స్త్రీ సాహసం వంటి చిత్రాల పాటలు శాస్త్రి రాసి ఇచ్చారు.‌ కొన్నా‌ళ్లకి సము‌ద్రాల పుత్రుడు రామా‌ను‌జా‌చా‌ర్యులు కూడా సంభా‌ష‌ణలు రాయ‌డంతో ఆయన్ని ‌‘‌‘జూని‌యర్‌ సము‌ద్రాల’‌ అన్నారు.‌ అప్పుడే ‌‘సము‌ద్రాల సీని‌యర్‌’‌ అనడం మొద‌ల‌యింది.‌ రామ‌కృ‌ష్ణ‌శాస్త్రి తానుగా రచన చెయ్యడం మొద‌లు‌పె‌ట్టిన తర్వాత, సము‌ద్రా‌లకి రాయడం తగ్గిం‌చే‌శారు.‌
కొన్నా‌ళ్లకు సాంఘి‌కా‌లకు అంటూ రచ‌యి‌తలు వచ్చిన తర్వాత సము‌ద్రా‌లకి సాంఘి‌కాల రచన తగ్గింది.‌ పౌరా‌ణి‌కా‌లకి ఎక్కు‌వగా రాశారు.‌ వినా‌యక చవితి, భూ కైలాస్, దీపా‌వళి, సీతా‌రా‌మ‌క‌ళ్యాణం, నర్త‌న‌శాల, పాండవ వన‌వాసం, శకుం‌తల, వీరా‌భి‌మన్యు మొద‌లైన చిత్రాలు సము‌ద్రాల పౌరా‌ణిక రచన ప్రతి‌భని తెలిపే చిత్రాలు.‌ సము‌ద్రాల దర్శ‌కు‌డిగా వినా‌య‌క‌ చ‌వితి, బభ‌ÅŸృ‌వా‌హన, భక్త‌ర‌ఘు‌నాథ్‌ చిత్రా‌లకు పని‌చే‌శారు.‌ రచన ఆయనే.‌
గూడ‌వల్లి రామ‌బ్రహ్మం 1941లో ‌‘అప‌వాదు’‌ తీశారు.‌ కె.‌ఎస్‌.‌ ప్రకా‌శ‌రావు, లక్ష్మీ‌రాజ్యం ముఖ్య‌న‌టులు.‌ ఈ సినిమా సము‌ద్రాల రచన.‌ ‘‘భార్యను భర్త అను‌మా‌నిం‌చడం అనే అంశాన్ని మొద‌టి‌సా‌రిగా ఈ సినిమా కథలో జొప్పిం‌చారు.‌ ఈ అంశం స్త్రీ ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ట్టు‌కుంది.‌ దాంతో తర్వాత వచ్చిన చాలా కథ‌లకి ఆ అంశం స్ఫూర్తిని ఇచ్చిం‌ద’’ని చెప్పారు ఆయన.‌ ‌‘‌‘నేను రాసిన పోతన, వేమన, త్యాగయ్యలాటి చిత్రాల్లో హాస్య‌పా‌త్రలు, హాస్య సన్ని‌వే‌శాలు లేవు.‌ కాక‌పో‌యినా హాస్యం రాయడం నాకు అంతగా పట్టు‌బ‌డ‌లేదు.‌ ‌‘బాల‌రాజు’, ‌‘స్వప్న‌సుం‌దరి’, ‌‘లైలా‌మజ్నూ’‌ మొద‌లైన సిని‌మాల్లో హాస్య‌పా‌త్రలు, సన్ని‌వే‌శాలు వున్నాయి.‌ సన్ని‌వేశ పరంగా నేనేదో సూచిస్తే, ఆ హాస్య‌న‌టుడే ఏదో అల్లు‌కుని నటిం‌చారు.‌ నా ఉద్దే‌శ్యంలో హాస్యం సన్ని‌వే‌శ‌ప‌రంగా రావాలి.‌ సంభా‌ష‌ణలు హాస్యంగా వచ్చి‌నంత మాత్రాన లాభం‌లేదు.‌ సన్ని‌వేశం వుంటే, సంభా‌ష‌ణలు అవే వస్తాయి’‌’‌ అని చెప్పే‌వారు సము‌ద్రాల.‌
అక్కి‌నే‌నికి తొలి రోజుల్లో దైతా గోపాలం, బలి‌జే‌పల్లి లక్ష్మీ‌కాంతం మీద భక్తి.‌ వాళ్లు ఆయన భాషని తీర్చి‌ది‌ద్దారు.‌ తర్వాత సము‌ద్రాల ‌‘విప్రనా‌రా‌యణ’‌ జరు‌గు‌తు‌న్న‌ప్పుడు, తనకి అలాంటి పాత్ర ధరిం‌చడం అదే మొదలు గనక, సము‌ద్రా‌లతో కూచుని సంభా‌ష‌ణలు, ఉచ్చా‌రణ, భాష నేర్చు‌కు‌న్నారు.‌ దోషాలు లేకుండా సుస్ప‌ష్టంగా పల‌కడం అభ్య‌సిం‌చారు.‌ ‌‘‌‘నా గురు‌తు‌ల్యు‌లులో సము‌ద్రాల ఒకరు’‌’‌ అని చెప్పే‌వారు ఆయన.‌ సము‌ద్రాల వైకుంఠ వాసు‌లై‌న‌పుడు నాగే‌శ్వ‌ర‌రావు హైద‌రా‌బా‌ద్‌లో ఉన్నారు.‌ వార్త తెలి‌య‌గానే విమా‌నంలో మద్రాసు బయ‌ల్దే‌రారు.‌ శ్మశా‌నంలో అంతిమ సంస్కా‌రాలు ఆరం‌భ‌మ‌య్యాయి.‌ చివరి ఘట్టం, భౌతి‌క‌కాయం నోట్లో బియ్యం వెయ్యడం.‌ సరిగ్గా ఆవే‌ళకి అక్కి‌నేని పరుగు పరు‌గున వచ్చి, పిడ‌క‌లతో ముఖం కప్పే వేళ పిడి‌కెడు బియ్యం నోట‌వేసి ‌‘అమ్మయ్య’‌ అను‌కొని దీర్ఘ నమ‌స్కారం చేసి తన భక్తిని సార్థకం చేసు‌కు‌న్నారు.‌
1 విప్రనారాయణలో భానుమతి, అక్కినేని
2 సముద్రాల రాఘవాచార్య (సీనియర్‌)
3 సముద్రాల జూనీయర్‌ బి.ఎన్‌.రెడ్డి హెచ్‌.ఎమ్‌.రెడ్డి చక్రపాణి మలా్లాది రామకృష్ణశాస్త్రి
article image
article image
article image
article image
article image
article image
article image


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.