ఆ ఇద్దరూ...
article imageఏయ‌న్నార్‌ వయ‌సులో ఎన్టీ‌ఆర్‌ కన్నా సుమారు 16 నెలలు చిన్న, కానీ సినిమా రంగంలో మాత్రం సుమారు 5 సంవ‌త్స‌రాల 10 నెలల సీని‌యర్‌.‌ 1949లో ఎన్టీ‌ఆర్‌ పరి‌శ్రమ‌లోకి ప్రవే‌శించే సమ‌యా‌నికే ఏయ‌న్నార్‌ బిజీ స్టార్‌.‌ అప్ప‌టికే ‌‘పల్నాటి యుద్ధం’, ‌‘బాల‌రాజు’, ‌‘కీలు‌గుర్రం’, ‌‘లైలా‌మజ్ను’‌ లాంటి సూపర్‌ డూపర్‌ హిట్స్‌తో ఏయ‌న్నార్‌ టాప్‌లో ఉన్నారు.‌ నాగయ్య, చద‌ల‌వాడ నారా‌య‌ణ‌రావు లాంటి సీని‌యర్‌ హీరోల కన్నా ఏయ‌న్నార్‌ లేతగా, గ్లామ‌ర‌స్‌గా కని‌పిం‌చ‌డంతో నిర్మా‌త‌లం‌దరూ ఆయన కోసమే ఎగ‌బడే వారు.‌ పౌరా‌ణి‌కాలు, జాన‌ప‌దాలు ఎక్కు‌వగా వెలు‌వడే ఆ రోజుల్లో అన్ని పాత్రలు ఏయ‌న్నా‌ర్‌నే వరిం‌చాయి.‌ దాంతో ఆయన అన్ని షిఫ్ట్‌‌¬్స‌లోను పని‌చే‌యాల్సి వచ్చింది.‌ ఓ దశలో కనీసం నిద్ర కూడా కర‌వై‌పో‌యింది.‌ అప్పుడు ఏయ‌న్నా‌ర్‌కి తన ఈడు వాడైన ఎన్టీ‌ఆర్‌ వచ్చా‌డని తెలి‌సింది.‌ ఆ రోజుల్లో గొప్పగా భావించే బీయే డిగ్రీ పాసై పరి‌శ్రమకు వచ్చిన ఎన్టీ‌ఆర్‌ని చూడ‌గానే ఆయన పర్స‌నా‌లిటీ ఏయ‌న్నార్‌ని ఆక‌ర్షిం‌చింది.‌ హమ్మయ్య నా వర్క్‌ లోడ్‌ తగ్గిం‌చే‌వాడు వచ్చా‌డని ఏయ‌న్నార్‌ అను‌కు‌న్నారు.‌ త్వర‌లోనే ఆ ఇద్దరూ మిత్రు‌ల‌య్యారు.‌ కానీ పుల్లలు పెట్టే‌వాళ్లు ఊరు‌కొం‌టారా? ఇక ఏయ‌న్నార్‌ పని సరి −‌ అంటూ ఆ రోజు‌ల్లోనే దుష్ప్ర‌చారం మొద‌లు‌పె‌ట్టారు.‌ ఏయ‌న్నార్, ఎన్టీ‌ఆర్‌లు అది పట్టిం‌చు‌కో‌లేదు.‌ ఇద్దరూ కలిసి బ్యాడ్మిం‌టన్‌ ఆడే‌వారు.‌ అలా ఆడు‌తు‌న్న‌ప్పుడే ఎన్టీ‌ఆర్‌కి ‌‘పాతా‌ళ‌భై‌రవి’‌లో అవ‌కాశం వచ్చింది.‌ ఆ సమ‌యా‌నికి జాన‌పద హీరోగా ఏయ‌న్నా‌ర్‌కి మంచి ఫాలో‌యింగ్‌ ఉండ‌టంతో ఆయన్ని హీరోగా పెట్టి ‌‘పాతా‌ళ‌భై‌రవి’‌ తీయా‌లని విజయా వారు అను‌కొ‌న్నా‌రట.‌ కానీ దర్శ‌కుడు కె.‌వి రెడ్డి మాత్రం ‌‘‌‘వెయిట్‌ అండ్‌ సీ’‌’‌ అనే‌వా‌రట.‌ ఓరోజు ఏయ‌న్నార్, ఎన్టీ‌ఆర్‌లు కలిసి బ్యాడ్మిం‌టన్‌ ఆడు‌తుం‌డగా కె.‌వి రెడ్డి చూశా‌రట.‌ ఎన్టీ‌ఆర్‌ కసిగా షాట్స్‌ కొడు‌తున్న తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్‌ కె.‌వి రెడ్డికి నచ్చాయి.‌ వెంటనే ‌‘పాతా‌ళ‌భై‌రవి’‌లో ఎన్టీ‌ఆర్‌కి అవ‌కాశం ఇచ్చి ఆయన జీవి‌తాన్ని మలుపు తిప్పారు.‌ ఇక ఏయ‌న్నార్‌−‌ ఎన్టీ‌ఆర్‌ల చిత్రా‌ను‌బం‌ధా‌నికి వస్తే.‌.‌.‌ ఆ ఇద్దరూ కలిసి ‘పల్లె‌టూరి పిల్ల’, ‌‘సంసారం’, ‌‘రేచుక్క’‌ (ఇందులో ఏయ‌న్నా‌ర్‌ది అతిథి పాత్ర), ‌‘పరి‌వ‌ర్తన’, ‌‘మిస్సమ్మ’, ‌‘తెనాలి రామ‌కృష్ణ’, ‌‘చర‌ణ‌దాసి’, ‌‘మాయా‌బ‌జార్‌’, ‌‘భూకై‌లాస్‌’, ‌‘గుండమ్మ కథ’, ‌‘శ్రీ కృష్ణా‌ర్జున యుద్ధం’, ‌‘భక్త రామ‌దాసు’‌ (ఇద్దరూ అతిథి పాత్రలు వేశారు), ‌‘చాణక్య చంద్రగుప్త’, ‌‘రామ‌కృ‌ష్ణులు’, ‌‘సత్యం శివం’‌ చిత్రాల్లో నటిం‌చారు.‌
article image


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.