అంజలిగా మారిన ఎస్వీఆర్‌

‘మాయా‌ బ‌జార్‌’‌లో ఘటోత్క‌చుడు మాయ శశి‌రేఖ రూపంలో నానా అల్లరీ చేయడం కథలో భాగం.‌ అలా స్త్రీ, పురుష పాత్రలు పర‌స్పరం మారిన సంద‌ర్భాలు చాలా సిని‌మాల్లో ఉన్నాయి.‌ కానీ పురుష పాత్ర ప్రధా‌నంగా రాసు‌కున్న కథతో కొంత‌మేర చిత్రీ‌క‌రణ పూర్తి‌ చే‌సిన తర్వాత అది స్త్రీ పాత్రగా మారిన ఓ సందర్భం ఇది.‌ కథలో ప్రధాన పాత్ర రామ‌భ‌క్తుడు.‌ అనా‌థ‌లైన ఓ తల్లికీ, ఆమె కుమా‌ర్తెకూ తన ఇంట ఆశ్రయం ఇస్తాడు.‌ ఇర‌వ‌య్యేళ్ల పాటు కంటికి రెప్ప‌లా కాపా‌డ‌తాడు.‌ చివ‌రకు ఆ అమ్మా‌యికి పెళ్లి చేసే సమ‌యా‌నికి ఆ తల్లీ, కూతుళ్లు తన కుమా‌రు‌డిని హత్య చేసిన దుర్మా‌ర్గుడి భార్యా‌బి‌డ్డ‌లని తెలు‌స్తుంది.‌ తీవ్రమైన ఘర్షణ నేప‌థ్యంలో ఆ రామ‌భ‌క్తుడు నిండు మన‌సుతో వారిని క్షమించి ఎప్ప‌టి‌లాగే ఆద‌రి‌స్తాడు.‌ ఇదీ ఇతి‌వృత్తం.‌ ఎస్వీ రంగా‌రావు ప్రధాన పాత్రలో మొదటి షెడ్యూల్‌ పూర్తి అయింది.‌ రెండో షెడ్యూల్‌ నాటికి ఎస్వీ‌ఆర్‌ మర‌ణిం‌చ‌డంతో చిత్రం ఆగి‌పోయే పరి‌స్థితి ఏర్ప‌డింది.‌ అప్పుడు దుక్కి‌పాటి మధు‌సూ‌ద‌న‌రావు, రచ‌యిత గొల్ల‌పూడి మారు‌తీ‌రావు కలిసి చర్చిం‌చు‌కుని ఎస్వీ‌ఆర్‌ పాత్రను మహిళా పాత్రగా మార్చి అంజ‌లీ ‌దే‌వితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు.‌ అదే 1975లో విడు‌ద‌లైన లలితా మూవీస్‌ వారి ‌‘చల్లని తల్లి’‌ చిత్రం.‌
− శ్రీవత్స


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.