నట యశస్వీ రంగారావు ఆడిన చదరంగం

కొన్ని విషయాలు వినేందుకు సరదాగా వుంటాయి. ముఖ్యంగా సినిమా సంగతులు! చరిత్రను పరికిస్తే డి.వి.నరసరాజు రచించిన ‘రాముడు-భీముడు’ సినిమా స్క్రిప్టు నాలుగేళ్లు అజ్ఞాతంలో గడిపింది. మిద్దె జగన్నాథరావు, భరణీ రామకృష్ణ ప్రసాద్‌తో సహా కొందరు తమిళ నిర్మాతలు కూడా ఆ స్క్రిప్టును వద్దన్న వాళ్లే. చివరికి రామానాయుడు వెలికితీస్తేగాని ఆ మట్టిలోని మాణిక్యం వెలుగులోకి రాలేదు. అలాగే ఏకంగా ఎనిమిదేళ్లుగా నరసరాజు వద్ద మగ్గిన మరో మరకతమే ‘చదరంగం’ సినిమా స్క్రిప్టు. జీవన సమరంలో ఎన్నో చిక్కులు ఏర్పడుతుంటాయి. వాటికి కారకులు కొందరు. ఇలాంటి జటిలమైన జీవిత సమస్యల్ని, చికాకుల్ని, చిక్కుల్ని తొలగించుకునేందుకు ఆత్మ స్థైర్యం కావాలి. నిర్భాగ్యుడైన భర్తతో ఒక నారీమణి ఈ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఇంటిపెద్ద చదరంగం క్రీడ వంటి నైపుణ్యంతో ఈ సమస్యల పరిష్కారానికి పావుగా నిలబడి రసవత్తంగా పరిష్కరించాడు. ఈ నేపథ్యంలో నట చక్రవర్తి ఎస్‌.వి.రంగారావు నిర్మాతగా మారి, స్వీయ దర్శకత్వంలో ప్రధానపాత్రను పోషిస్తూ నిర్మించిన ఉత్తమ చిత్రం ‘చదరంగం’ మండు   వేసవి 19 మే, 1967న విడుదలై ప్రేక్షకులకు వానజల్లు కురిపించి ఆనందాన్ని పంచింది. యాభైరెండు వసంతాలు పూర్తి చేసుకున్న ఆ ‘చదరంగం’ సినిమా విశేషాలు సితార పాఠకులకోసం...

తెరవెనుక చిదంబర రహస్యం
‘కింగ్‌ లియర్‌’ నాటకంలో షేక్స్పియర్‌ ‘మానవులు సహసం వీడక ముందుకు సాగాలి. ఆ నిరీక్షణే పరిపూర్ణతను సిద్ధింపు జేస్తుంది’ అంటూ ఒక ఓదార్పు వాక్యాన్ని పలికిస్తాడు. ఈ స్పూర్తితోనే స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ప్రఖ్యాత రచయిత ఎరిక్‌ లింక్లేటర్‌ 1935 ‘రైప్నెస్‌ ఈజ్‌ ఆల్‌’ పేరుతో ఒక సృజనాత్మక నవల రచించాడు. సాహిణీ వారి ‘పెంకి పెళ్లాం’ సినిమా తరువాత నిర్మించబోయే సినిమా కోసం నిర్మాత ఎస్‌.వి.రంగారావు సన్నివేశాలను స్పూర్తిగా తీసుకొని నరసరాజు ఒక మంచి కుటుంబ కథను తయారుచేసి స్క్రిప్టు రూపొందించారు. భావనారాయణ సమక్షంలో దర్శకుడు పి.పుల్లయ్య ఆ స్క్రిప్టు విని పెదవి విరిచారు. పుల్లయ్య అంతకు ముందే శివాజీ గణేశన్‌తో ‘వణంగాముడి’ తెలుగులో ‘తలవంచని వీరుడు’గా డబ్‌ చిత్రం తీసి సూపర్‌ హిట్‌ చేసి వున్నారు. ‘‘నాచేత సినిమా చేయించుకుంటూ ఎవరైనా పెద్ద నటుడితో భావనారాయణను నిరాశ పరచారు. ఎన్టీఆర్‌కు వేషం ఉండేలా కథను మార్చమంటే నరసరాజు ఒప్పుకోలేదు. ఆచార్య ఆత్రేయతో నరసరాజు కథకు మార్పులు చేయించాలని భావనారాయణ ప్రయత్నాలు చేశారు. కానీ నరసరాజు ఒక్క మెట్టుకూడా కిందికి దిగలేదు. దానితో నరసరాజు స్క్రిప్టుకు తిలోదకాలిచ్చి భావనారాయణ ఎన్టీఆర్‌తో ‘బండరాముడు’ సినిమా ప్రారంభించారు. నరసరాజు రాసిన స్క్రిప్టుకు రహస్యం’ అని తొలుత పేరు నిర్ణయించారు. అలా ఏళ్లు గడిచాయి. 1966లో ఎస్వీరంగారావు ఎస్‌.వి.ఆర్‌ ఫిలిమ్స్‌ అనే పేరుమీద కంపెనీ స్థాపించి నరసరాజుకు కబురంపారు. అంతకుముందే ఏ.వి.మెయ్యప్పచెట్టి భాగస్వామిగా ఏర్పడి యస్వీఆర్‌ ‘నాదీ ఆడజన్మే’ సినిమా నిర్మించివున్నారు. ఆ సినిమాకు మాటలు సమకూర్చింది నరసరాజే కావడంతో కథాచార్చల కోసం పిలిచారు. ఒక తమిళ రచయిత రాసిన కథను యస్వీఆర్‌ నరసరాజుకు పంపిస్తే అది ఆయనకు నచ్చలేదు (ఆ కథనే తరవాత రామానాయుడు ‘సిపాయి చిన్నయ్య’ చిత్రంగా నిర్మించారు). అప్పుడు ‘చిదంబర రహస్యం’ స్క్రిప్టు చర్చకు వచ్చింది. ఆ స్క్రిప్టు బాగా నచ్చడంతో ఆ స్క్రిప్టుకు ‘చదరంగం’ అనే పేరు ఖాయం చేసి సినిమాగా మలిచారు.

చదరంగంలో ఏముంది
ఆ గ్రామంలో పరమేశం (యస్వీ రంగారావు) ధనవంతుడే కాదు నీతి నిజాయితీలలో అతన్ని మించినవారు అవ్వాయి తువ్వాయిలన్నా పరమేశానికి చిరాకు. అతని తమ్ముడు పరంధామయ్య (ధూళిపాళ) మంచివాడే కానీ భార్యా విధేయుడు. సొంత అభిప్రాయ మంటూ లేదు. ఒకవేళ వున్నా అది చెల్లని రూపాయే! భార్య ఆడది మగాడికి బానిసై పోతుందని వివాహం చేసుకునేందుకు మొరాయిస్తూ ఉంటుంది. ఆమె మారుటి అందవిహీనురాలని ఆమెను పుట్టింటిలోనే వదిలేసి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. దర్జాలకు పరంధామయ్యను అప్పుల ఊబిలోకి దించుతారు. పరమేశానికి మరొక మరణించిన తమ్ముడున్నాడు. కూతురు సీత (జమున) పరమేశం వద్దే పెరిగింది. ఆమెను కన్నకూతురికంటే ఆప్యాయంగా పెంచాడు పరమేశం. అయితే సీత పరమేశాన్ని కాదని రాము (హరనాథ్‌) అనే అభాగ్యున్ని పెళ్లాడింది అతన్ని పెళ్లాడి కష్టాలను కొనితెచ్చుకుంది. అయితే పరమేశం పెంపకంలో పెరిగిన అనుభవంతో ఆ కష్టాలను ధైర్యంతో ఎదుర్కొంది. ఆ చికాకుల్ని సంయమనంతో పరిష్కరించుకుంటూ భర్తను దారిలో పెట్టగలిగింది. పరమేశం శక్తియుక్తులతో అన్ని సమస్యల్నీ పరిష్కరించాడు. ఇదే చదరంగం కథ. చదరంగంలో గెలిచినవాడే మహిళలను బాగా ఆకట్టుకుంది.


టి.వి.రాజు సంగీతం
‘ఇల్లాలంటే నీవమ్మా’ అనే పాటను ఘంటసాల ఆలపించారు. ఇది బహుళ జనాదరణ పొందిన పాట కావడం చేత ఈ నాటికీ రేడియోలో వినిపిస్తూనే వుంటుంది. పాటలో సాహిత్యం అద్భుతంగా వుంటుంది. ‘చీకటి బోధించే విధంగా ఈ దాశరథి ఈ పాటను మలిచారు. ఇందులోనే ఒక తత్వాన్ని బోధించే ‘నీవెవరన్నా నేనేవరన్నా.... నీలోనే నాలోనూ శివుడొక్కడన్నా’ అనే పాటను మాధవపెద్ది ఆలపించారు. నీరెంతవుందో సంసారమందున్న సారమంతేలే’ అంటూ ఉద్బోధ చేసే పాట ఇది. ‘సయ్యారి సయ్యారి’ స్వర్ణలత బృందం ఆలపించారు. ఇలాంటి పాటే మరొకటి వుంది. ‘వలచిన మనసే మనసు వలపే జగతికి బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో ఆనందం’ అనేది సాధారణ పాట.


మరిన్ని విశేషాలు


* శ్రీ 1967 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చదరంగం సినిమాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి రజత నంది పురస్కారాన్ని అందించింది. నిర్మాతగా యస్వీ రంగారావు ఆ బహుమతిని నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతులమీదుగా స్వీకరించారు. ప్రధమ బహుమతి ‘సుడిగుండాలు’ నరసరాజుకు లభించింది.
* శ్రీ చదరంగం సినిమా విజయంతో యస్వీ రంగారావు 1968లో నిర్మించిన ‘బాంధవ్యాలు’ సినిమాకు కూడా నరసరాజే సంభాషణలు సమకూర్చారు. ఇష్టం లేదు. నేనే డైరెక్టు  చేస్తాను’’ అని ఎస్వీఆర్‌ దర్శకత్వ బాధ్యతలు మోశారు.

* దర్శకుడిగా ఎస్వీఆర్‌ ఇదే మొదటి చిత్రం. కాంబినేషన్‌లో సినిమా తీయాలని కథాచర్చలు ప్రారంభించారు. యస్వీ రంగారావు ప్రధాన పాత్రగా నరసరాజు కథ అల్లారు. అందులో హీరో పాత్ర లేదని భావించి భావనారాయణ ఈ కథ మీద ఆసక్తి చూపలేదు.

* శ్రీ నరసరాజు స్క్రిప్టుకు మార్పులు చేసేందుకు ఒప్పుకోకపోవడంతో భావనారాయణ ‘చదరంగం’ సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నారు.

- ఆచారం షణ్ముఖాచారి



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.