115 వారాలు ఆడిన సినిమా...


‘‘హరిదాస్‌’’ అనే తమిళ చిత్రం 1944లో విడుదలై గొప్ప విజయం సాధించింది. మద్రాసు నగరంలోని ఒక థియేటర్‌లో రోజుకి మూడాటలు చొప్పున, 115 వారాల పాటు నడిచింది. ఇందులో ముఖ్య పాత్రధారి త్యాగరాజ భాగవతార్‌. ఆయన పాడిన పాటలన్నీ ప్రసిద్ధి పొందాయి. పాపనాశమ్‌ శివన్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమానే తెలుగులో ‘పాండురంగ మహత్యం’ (1957)గా నిర్మిస్తే, అదీ ఘన విజయం సాధించింది. ఈ సినిమాలోని 13 నిమిషాల పాట ‘జయకృష్ణా ముకుందా మురారి’ (ఘంటసాల) శ్రవణపేయం. ఎప్పుటికీ వినిపించే పాట. విశేషం ఏమిటంటే, ‘హరిదాస్‌’ సినిమాలో త్యాగరాజ భాగవతార్‌ పాడిన వరసనే, తెలుగు సినిమాలోనూ వాడారు (సంగీతం: టి.వి.రాజు)చరణాలు మార్పుతో. ఇంకో విశేషం ఏమిటంటే ‘హరిదాస్‌’ సినిమా అప్పట్లో ఆంధ్రదేశంలోనూ విడుదలై బాగా నడిచింది. డబ్బింగ్‌ రాలేదు. తమిళ చిత్రమే.
- రావి కొండలరావు




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.