38 సంవత్సరాల ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం 1982 ఏప్రిల్ 23విడుదల అయ్యి నేటికీ 38 సంవత్సరాలు. ఈ చిత్రం లో రాజశేఖరం గా చిరంజీవి, జయ లక్ష్మి గా మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ గారు తొలి సారీ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం చేయగా గొల్లపూడి మారుతీరావు గారు తొలి సారీ నటించి అద్భుత మైన మాటలు అందించారు.


కథ క్లుప్తంగా:
రాజశేఖరం(చిరంజీవి) ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి)తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు (గొల్లపూడి) జయలక్ష్మి(మాధవి) మీద కన్నేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధాన కథ. ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు 2 కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ఆడింది. హైదరాబాద్ సిటీలో డైరెక్ట్ రిలీజ్లో శాంతి (నారాయణ గూడ)లో 3 ఆటలు -106. డైరెక్ట్ రన్, నాంపల్లి - లతలో ఉదయం ఆటలు -52 రోజులు డైరెక్ట్ రన్ + షిఫ్ట్ పై సిటీలో 519 రోజులు రన్ కావటం విశేషం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.