ముందు పులి... వెనక సింహం!
హాస్య నటుడు పద్మ‌నాభం తమ సొంత బ్యానర్‌ ‌రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్ పతాకంపై మొదటి చిత్రంగా 1965లో ‌‘దేవత’‌ నిర్మి‌స్తున్న రోజులు.‌ అందులో ఓ పాట అవు‌ట్‌డోర్‌ షూటింగ్‌ కోసం సాత‌నూర్‌ డ్యాంకి వెళ్తు‌న్నారు.‌ హీరో ఎన్టీ‌ఆర్‌ని ప్రత్యే‌కంగా ఓ కారులో తీసు‌కె‌ళ్తు‌న్నారు.‌ రాత్రి ప్రయాణం.‌ ఎన్టీ‌ఆర్‌ వెనక సీట్లో హాయిగా నిద్ర పోతు‌న్నారు.‌ కారుని పద్మ‌నాభం తమ్ముడు పురు‌షోత్తం నడు‌పు‌తు‌న్నారు.‌ తోవలో చిట్ట‌డవి.‌.‌.‌ మెలి‌కలు తిరి‌గిన రోడ్డు.‌.‌.‌ రోడ్డుకి అడ్డంగా ఓ చిరుత పులి.‌.‌.‌ పద్మ‌నా‌భంకి, ఆయన తమ్ము‌డికి ముచ్చె‌మ‌టలు.‌ హారన్‌ కొట్ట‌కుండా, కారు హెడ్‌లైట్‌ మాత్రం ఆన్‌ చేసి ఉంచారు.‌ కాసే‌ప‌టికి చిరుత పులి మౌనంగా అడ‌వి‌లోకి వెళ్లి‌పో‌యింది.‌ కారు బయ‌ల్దే‌రింది.‌ తెల్ల‌వా‌రిన తర్వాత ఎన్టీ‌ఆర్‌తో పులి గురించి చెప్పగా.‌.‌.‌ అప్పుడు ఎన్టీ‌ఆర్‌−‌ ‌‘‌‘అరె.‌.‌.‌ నన్ను లేప‌క‌పో‌యారా నేను కూడా చూసి ఉండే‌వాణ్ని కదా?’‌’‌ అన్నా‌రట! అప్పుడు పద్మ‌నాభం ‌‘‌‘అన్న‌గారూ కారు ముందు పులి ఎలాగూ ఉంది.‌ కారు వెనుక సీట్లోని సింహాన్ని లేపితే ఇంకే‌మైనా ఉందా!’‌’‌ అన్నా‌రట.‌ దానికి ఎన్టీ‌ఆర్‌ సింహం లెవల్లో నవ్వా‌రట! ఇది జరి‌గిన చాలా కాలం తర్వాత ఆయన సొంత బ్యానర్‌ మీద ‌‘‌‘సింహం నవ్వింది’‌’‌ (03−‌03−‌1983)అని ఓ సినిమా తీయడం అది వేరే కథ!

article image
బ్రహ్మ ఎలా మాట్లాడాలి?
అది 1962.‌.‌.‌ ‌‘శ్రీకృ‌ష్ణా‌ర్జున యుద్ధం’‌లో బ్రహ్మ, సర‌స్వతి మాట్లా‌డు‌కునే సన్ని‌వే‌శాన్ని దర్శ‌కుడు కె.‌వి రెడ్డి చిత్రీ‌క‌రి‌స్తు‌న్నారు.‌ షాట్‌ ఓకే అయింది.‌ అంతలో ఏ మూల నుంచో గుస‌గు‌సలు.‌ కె.‌వి రెడ్డి షూటిం‌గ్‌లో ఉన్న‌ప్పుడు చీమ చిటు‌క్కు‌మ‌న‌డా‌నికి వీల్లేదు.‌ ఆయన చిరాగ్గా తల‌తిప్పి చూశారు.‌ ఒక లైట్‌ బాయ్‌.‌.‌ పక్క‌నున్న వ్యక్తితో తగ్గిం‌చిన స్వరంతో మాట్లా‌డు‌తు‌న్నాడు.‌ ‌‘‌‘ఏమి‌టది?’‌’‌ అంటూ కె.‌వి రెడ్డి లైట్‌ బాయ్‌ని ప్రశ్నిం‌చారు.‌ అప్పు‌డ‌తను తడ‌బ‌డ‌కుండా ‌‘‌‘సార్‌ బ్రహ్మ‌దే‌వు‌డికి నాలుగు ముఖా‌లు‌న్నాయి కదా? పక్కనే ఉన్న సర‌స్వతీ దేవితో అటు‌వై‌పున్న ముఖంతో మాట్లా‌డ‌కుండా అన్ని తలలూ తిప్పి మాట్లా‌డటం దేనికి?’‌’‌ అన‌డి‌గాడు.‌ మామూ‌లుగా అయితే మండి‌పడే కె.‌వి రెడ్డి క్షణ‌కాలం పాటు ఆలో‌చిం‌చారు.‌ లైట్‌ బాయ్‌ అడి‌గిన ప్రశ్న అర్థ‌వం‌త‌మైం‌దని గ్రహిం‌చారు.‌ ‌‘‌‘నీతో నేను పూర్తిగా ఏకీ‌భ‌వి‌స్తు‌న్నాను.‌ కానీ నువ్వ‌న్న‌ట్లుగా సర‌స్వతీ దేవి వైపున్న తలతో బ్రహ్మను మాట్లా‌డించే సాంకే‌తిక సౌలభ్యం మనకు అందు‌బా‌టులో లేదు.‌.‌.‌ అది గనక ఉంటే తప్ప‌కుండా బ్రహ్మ‌దే‌వుడి పాత్రను తల తిప్ప‌కుండా మాట్లా‌డిం‌చా‌ల్సిందే!’‌’‌ అంటూ లైట్‌ బాయ్‌ సందే‌హాన్ని మెచ్చు‌కుంటూ నివృత్తి చేశా‌రా‌యన.‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.