ఎన్టీఆర్‌.. బాలయ్యల.. ‘యమగోల’!!
ఎన్టీఆర్‌ కథానాయకుడిగా 1977లో వచ్చిన ‘యమగోల’ అద్భుత విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి డి.వి.నరసరాజు రాసిన సంభాషణలు జనాన్ని ఆకట్టుకున్నాయి. స్క్రిప్టు రాస్తున్నప్పుడు ప్రధాన పాత్రల విషయమై నరసరాజుకు ఓ ఆలోచన వచ్చిందట. అదే ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘దాన వీర శూర కర్ణ’లో అభిమన్యుడిగా బాలకృష్ణ ప్రేక్షకలను మెప్పించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘యమగోల’లో కథానాయకుడి పాత్రకు బాలకృష్ణను తీసుకుని యముడి పాత్రను ఎన్టీఆర్‌తో చేయిస్తే తండ్రీకుమారుల కలయిక బ్రహ్మాండంగా రక్తి కడుతుందని నరసరాజుకు అనిపించిందట. ఆ విషయాన్ని ఆయన ‘యమగోల’ నిర్మాత సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఎస్‌.వెంకటరత్నంతో పంచుకుని ఎన్టీఆర్‌ని అడగమన్నారట. కథ ఓకే అన్న ఎన్టీఆర్‌ తండ్రీకుమారుల కాంబినేషన్‌ విషయంలో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారట. ‘‘ప్రస్తుతం బాలయ్య చదువుని దృష్టిలో ఉంచుకుని సొంత చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. బయట చిత్రాల గురించి ఆలోచించటం లేద’’ని చెప్పారట. ఒక వేళ ఎన్టీఆర్‌ ఒప్పుకొని ఉంటే ప్రేక్షకులకు ఓ అద్భుతమైన కాంబినేషన్‌ చూసే అవకాశం దక్కేది.

- శ్రీవత్సCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.