అందుకే నీలాంబరి పాత్ర చేయకూడదనుకున్నా!!

ప్పటి వరకు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణను.. శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా మార్చిన చిత్రం ‘నరసింహా’. ఈ సినిమాతోనే ఆమె స్టార్‌డమ్‌ అమాంతం పెరిగింది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రతినాయకురాలిగా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటన సినీ ప్రియులతో పాటు విమర్శకులను మెప్పించింది. అయితే తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టింది రమ్యకృష్ణ. ‘‘నరసింహా’లోని నీలాంబరి పాత్రను చేయడం మొదట్లో నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తల పొగరు ఎక్కువగా ఉన్నట్లు ఆ పాత్రను తీర్చిదిద్దారు. అయితే అది కేవలం సినిమాలోని పాత్రే అని నాకు తెలుసు. కానీ, దర్శకుడు ‘నీకు నీలాంబరి పాత్ర కావాలా? సౌందర్య పాత్ర కావాలా?’ అని అడిగి ఉంటే సౌందర్య పాత్రే కావాలని చెప్పేదాన్ని. కానీ, అది జరగలేదు. ఈ చిత్రంలో నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను. కానీ, దర్శకుడి విజన్‌ను నమ్మా కాబట్టి ఆ పాత్రను అంత బాగా చేయగలిగా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సీనియర్‌ నటి ‘సూపర్‌ డీలక్స్‌’ అనే చిత్రంలో పోర్న్‌స్టార్‌ పాత్రలో నటించారు. విజయ్‌ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.