ఉప పాత్రలే అయినా... ఉపయోగపడేవే
article imageప్రతి సిని‌మా‌లోనూ పాత్రలు వుంటాయి.‌ కొన్ని ముఖ్య‌పా‌త్రలు, కొన్ని ఉప‌పా‌త్రలూ.‌ నాయి‌కా‌నా‌యక పాత్రల్ని ప్రధాన పాత్రలుగా పరి‌గ‌ణి‌స్తారు.‌ తక్కి‌నవి ముఖ్య‌పా‌త్రలు.‌ అంటే నాయికా నాయ‌కుల తల్లి‌దం‌డ్రులు, వారికి తోడుగా సహా‌య‌పా‌త్రలుగా వుండేవి.‌ కథా‌గ‌మ‌నా‌నికి అవ‌స‌ర‌మైన మరి‌కొన్ని పాత్రల్ని ఉప‌పా‌త్రలు అనే‌వారు.‌ సాధా‌ర‌ణంగా ఉప పాత్రలంటే ఇంట్లోని నౌకర్లు, గుమ‌స్తాలూ.‌ ఈ పాత్రలు సిని‌మాలో వస్తూనే వుంటాయి.‌ అయితే ఆ రోజు‌ల్లోని సిని‌మాల్లో ఈ ఉప‌పా‌త్రలకి కూడా ప్రాధన్యం వుండేది.‌ మనం‌ద‌రికీ బాగా తెలి‌సిన ‌‘‌‘మాయా‌బ‌జార్‌’‌’‌ తీసు‌కుందాం.‌ కృష్ణుడు, బల‌రా‌ముడు, దుర్యో‌ధ‌నుడు, అభి‌మ‌న్యుడు, శశి‌రేఖా, రేవతి, లక్ష్మ‌ణ‌కు‌మా‌రుడు, సుభద్ర, శకుని, ఘటో‌త్క‌చుడు, హిడింబి మొద‌లై‌నవి ప్రధా‌న‌పా‌త్రలు.‌ కథ వీరి‌మీ‌దనే నడు‌స్తుంది.‌ వీటిలో ఏ పాత్ర లేక‌పో‌యినా కథ అసం‌పూర్ణం.‌ శర్మ, శాస్త్రి, సారథి, చిన‌మయి, లంబు, జంబు, ఇతర ఘటో‌త్క‌చుడి పరి‌వారం, ఉప‌పా‌త్రలు.‌ ఈ ఉప‌పా‌త్రలు లేక‌పో‌యినా, కథ చెప్ప‌డా‌నికి ఇబ్బంది వుండదు.‌ ఐతే ఈ పాత్రలూ సినిమా నడ‌కని ఎగ‌దో‌స్తాయి.‌ ఉప పాత్రల సహాయ సహ‌కా‌రాలు లేకుండా, ఊహిం‌చు‌కుంటే కథ, కథ‌గానే వుంటుంది గాని, వినో‌దా‌త్మ‌కంగా, ఉత్సా‌హ‌భ‌రి‌తంగా వుండదు.‌ కథని నిర్ణ‌యిం‌చి‌న‌ప్పుడు, ప్రధాన పాత్రలు మాత్రమే వుంటాయి.‌ స్క్రీ¬‌న్‌ప్లే చర్చల్లో ఉప‌పా‌త్రలు పుట్టు‌కొ‌స్తాయి.‌ ఏ సినిమా అయినా, కళా‌త్మ‌కంగా వినో‌దా‌త్మ‌కంగా ఉండా‌లనే నాటి చిత్రకా‌రులు కోరు‌కు‌నే‌వారు.‌ ఘటో‌త్క‌చుడి వేపు ఉన్న చిన‌మయ, లంబు జంబూలు కావ‌లి‌సి‌నంత వినోదం అంది‌స్తారు.‌ అలాగే, దుర్యో‌ద‌నుడి ఆస్థా‌నంలో ఉన్న శర్మ, శాస్త్రి వినోదం అంది‌స్తారు.‌ లక్ష్మణ కుమా‌రుడు ప్రక్కన సారధి కూడా వినో‌దార్ధం కల్పిం‌చ‌బ‌డి‌న‌వాడే.‌ ఈ పాత్రలు స్క్రీన్‌ప్లే చర్చలో ప్రవే‌శించి, కథని ఉత్సా‌హ‌భ‌రితం చేశాయి.‌ ఇలాంటి పాత్రల్ని సృష్టిం‌చిన దర్శక రచ‌య‌త‌లి‌ద్దరూ అఖం‌డులు.‌ ఉప‌పా‌త్రల్ని ప్రవే‌శ‌పె‌ట్ట‌గానే సరి‌పో‌దని, వాటికి ప్రయో‌జనం ఉండా‌లనీ చెప్పే స్క్రీన్‌ప్లే ‌‘మాయా‌బ‌జార్‌’‌.‌ ఘటో‌త్క‌చుడు ద్వార‌కలో శశి‌రేఖ కోసం ప్రేవే‌శిం‌చి‌న‌పుడు, సుల‌భంగా శశి‌రేఖ ఎవరో కను‌క్కో‌లేని వాడు కాదు.‌ ఎన్నో విష‌యాలు కను‌క్కో‌గ‌లి‌గిన ఘటో‌త్క‌చు‌డికి అది కష్ట‌మై‌న‌దేమీ కాదు.‌ ఐతే, దృశ్యా‌నికి ఒక ఉత్సాహం తేవా‌లని, చెట్టు‌కింద కూర్చుని, ‌‘చిరం‌జీవ సుఖీ‌భవ’‌ అనే మంత్రం చెబు‌తున్న వృద్ధ పాత్రని కల్పిం‌చారు.‌ ఆ పాత్ర ద్వారా కృష్ణుడు, ఘటో‌త్క‌చు‌డికి తెలి‌శాడు.‌ ఆ దృశ్యం మరు‌పు‌రాని దృశ్యం.‌ అది ఒక్క దృశ్యంలో కని‌పిం‌చిన ఉప‌పాత్ర.‌ అయినా ఎంతో ప్రయో‌జ‌నంతో కూడు‌కున్న పాత్రగా రూపొం‌దింది.‌ దుష్ట‌చ‌తు‌ష్ట‌యంలో కర్ణుడు, దుశ్శా‌స‌నుడు ఉప‌పా‌త్రల కిందే లెక్క.‌ శకుని, దుర్యో‌ధ‌నునే ప్రధా‌నులు.‌ అందుకే దుశ్శా‌సన, కర్ణ‌పా‌త్రలు ద్వారా కాస్త హాస్యం కని‌పిం‌చేలా దిద్దారు.‌

జాన‌పద చిత్రాల్లో ఉన్నత పీఠంలో కని‌పించే చిత్రం ‌‘పాతా‌ళ‌భై‌రవి’‌.‌ ఈ చిత్రం కేవలం కల్పనా కథనం.‌ జాన‌పద చిత్రాల్లో విధిగా నాయ‌కుడి పాత్రకి జత‌గా‌డిని చేరు‌స్తారు.‌ జత‌గాడి ద్వారా హాస్యం పలి‌కి‌స్తారు.‌ వీల‌యితే, నాయిక చెలి‌క‌త్తెతో ప్రేమ వ్యవ‌హారం పెడ‌తారు−‌ పాట‌కూడా పెట్ట‌వచ్చు.‌ ఈ జత‌గాడు ఉప‌పాత్ర కిందే లెక్క.‌ అయినా ఒక్కో‌సారి హీరోకి సహా‌య‌పడి మేలు చేస్తాడు.‌ ఎంత గొప్ప జాన‌పద కథా‌నా‌య‌కు‌డైనా, అన్నీ తాను ఒక్కడే సాధిం‌చ‌లేడు.‌ ఎవరి సహా‌య‌మైనా ఉండాలి.‌ ‌‘బాల‌నా‌గమ్మ’‌ (1942) సిని‌మాలో, బాల‌వ‌ర్ధి‌రాజు అనే బాలుడు, మాయ‌ల‌మ‌రాఠీ చెరలో ఉన్న తల్లిని చూడ్డా‌నికి వెళ్లి‌న‌ప్పుడు, అమ్మ‌వారు ప్రత్య‌క్షమై వాడికి కత్తి ఇస్తుంది.‌ అలాగే సప్త‌స‌ము‌ద్రాలు దాటి, మాయ‌ల‌ఫ‌కీరు ప్రాణం ఉన్న చిలుక దగ్గ‌రికి వెళ్లే‌ముందు, పర‌మ‌శి‌వుడు ప్రత్య‌క్షమై పక్షిని ఇచ్చి పక్షి‌మీద సము‌ద్రాలు దాట‌మం‌టాడు.‌ అలా, పలు సహా‌యాలు అందుతూ ఉంటాయి నాయ‌కు‌డికి.‌ ‌‘పాతా‌ళ‌భై‌రవి’‌లో తోట‌రా‌ముడు నాయ‌కుడు.‌ అత‌డికి జత‌గాడు అంజి అనే పాత్ర.‌ ఇది ఉప‌పాత్రే గాని, నాయ‌కు‌డికి సహాయం చేసే పాత్ర.‌ హీరో నేపాళ మాంత్రి‌కుడి చెరలో బంధిం‌ప‌బడి ఉన్న‌ప్పుడు, భూతాల ద్వారా సంగ్రహిం‌చిన చెప్పులు, శాలు‌వాతో అంజి వచ్చి, నాయ‌కు‌డిని విడి‌పి‌స్తాడు.‌ ఉప‌పా‌త్రకి బలం చేకూ‌రింది.‌ అలాగే తోట‌రా‌ముడు, పాతా‌ళ‌లో‌కం‌లోని కొల‌నులో స్నానా‌నికి వెళితే, మక‌ర‌రూ‌పంలో ఉన్న ఒక కన్య నాయ‌కు‌డికి సహాయం చేస్తుంది.‌ మాంత్రి‌కుడు టక్క‌రి‌వా‌డని, అమ్మ‌వా‌రికి బలి ఇవ్వ‌డా‌నికే పథకం వేస్తు‌న్నా‌డనీ చెప్పి మాయ‌మై‌పో‌తుంది.‌ ఇది ప్రయో‌జనం ఉన్న ఒక్క దృశ్యపు ఉప‌పాత్ర.‌ మాంత్రి‌కుడి శిష్యుడు−‌ సదా జపుడు కూడా ఉప‌పాత్రే అయినా, మాంత్రి‌కు‌డికి సహా‌య‌ప‌డ‌తాడు.‌ మాంత్రి‌కు‌డిని, తోట‌ రా‌ముడు పాతా‌ళ‌భై‌ర‌వికి బలి ఇచ్చి‌న‌ప్పుడు సదా‌జ‌పుడే బయ‌ల్దేరి సంజీ‌వ‌నితో మాంత్రి‌కు‌డిని బతి‌కి‌స్తాడు.‌ ఇలా ఉప‌పా‌త్రలు ప్రధాన పాత్రలకి సహ‌క‌రిస్తూ ఉంటాయి.‌ సహ‌క‌రిం‌చ‌క‌పోతే, ఉప పాత్రల ప్రయో‌జనం శూన్యం.‌ సహాయ పాత్రలు వేరే ఉంటాయి.‌ జాన‌పద, పౌరా‌ణి‌కాల్లో ద్వార‌పా‌ల‌కులు, చెలి‌క‌త్తెలూ రాజ‌మం‌దిర శోభకి ఉప‌యో‌గ‌ప‌డ‌తారు.‌ దర్బా‌రులో సైని‌కులు లేక‌పో‌యినా, రాజ‌కు‌మారి అంతః‌పు‌రంలో చెలులు లేక‌పో‌యినా వెలితే.‌

సాంఘిక చిత్రా‌ల్లోనూ ఉప పాత్రలు ఉంటాయి.‌ ప్లీడరు గుమ‌స్తాలు, ఇంట్లోని నౌకర్లు, కారు డ్రైవర్లు, పోలీ‌సులు మొద‌లైన పాత్రలు ఉప‌ పా‌త్రలు.‌ కథా‌ను‌సారం కొన్ని ఉప‌యో‌గ‌ప‌డ‌తాయి.‌ కొన్ని మామూ‌లుగా ఉంటాయి.‌ పోలీ‌స్‌స్టే‌ష‌న్‌లోని ఇన్‌స్పె‌క్టర్‌ ఉప పాత్రే అయినా, సెంట్రీలు ఉంటారు.‌ అలాగే కోర్టులు.‌ సిని‌మాల్లో నేరాలు ప్రధాన కథ అయితే, పోలీసు బలగం, కోర్టులు, జైళ్లు కచ్చితం.‌ కోర్టు‌లోని జడ్జి పాత్ర చిన్నదే అయినా, ‌‘తీర్పు ఏం చెబు‌తాడా’‌ అని ఉత్కం‌ఠతో ఉంటారు అందరూ.‌ అంచేత ఉప‌పాత్ర అయినా, ప్రధా‌నం‌గానే ఉంటుంది.‌ నాగయ్య గారు చాలా చిత్రాల్లో జడ్జిగా అభి‌న‌యిం‌చారు.‌ ఉప‌పా‌త్రలు నిష్ప్ర‌యో‌జనం కాకూ‌డ‌దని, కథలో కల‌పడం శ్రేయో‌దా‌యకం అని ఆనాటి చిత్రాల్లో ఉప‌పా‌త్రలకి కూడా ప్రాధాన్యం కల్పిం‌చారు దర్శక రచ‌యి‌తలు.‌ విజ‌య‌వారి తొలి‌చిత్రం ‌‘షావు‌కారు’‌ (1950)లో రేలంగి, కనకం, వంగర మొద‌లైన వారు ధరిం‌చి‌నవి ఉప పాత్రలే.‌ కాని అన్నీ కథలో కలిసి, కథని నడి‌పి‌స్తాయి.‌ ముఖ్యంగా చాకలి రామి‌పాత్ర.‌ ఇది చిన్న పాత్రే అయినా కథలో లీన‌మ‌యిన పాత్ర.‌ రౌడీ రంగడు చెయ్య‌బోయే దొంగ‌తనం కని‌పెట్టి, నాయి‌కకి చెబు‌తుంది.‌ చిత్రం చివర్లో షావు‌కా‌రి‌గారి తాళం‌చె‌వులు ‌‘‌‘ఎవ‌రికి చెందాలి?’‌’‌ అను‌కుంటూ వుంటే ‌‘‌‘రామికి చెందాలి’‌’‌ అని ఎప్ప‌డంతో ఆ ఉప‌పా‌త్రకి నిండు‌దనం వచ్చింది.‌ కిరాణా దుకాణం పెట్టు‌కున్న రేలం‌గిది పెద్ద‌పా‌త్రకాదు గాని, ఉన్నంత వరకూ అద్భు‌తంగా వుంటుంది.‌ ఆ చిత్రం‌లోని పద్మ‌నాభం నౌకరు.‌ ఆ పాత్రకీ ప్రయో‌జనం కని‌పి‌స్తుంది.‌

మొదట్లో యస్‌.‌వి.‌రంగా‌రావు, సావిత్రి, గిరిజ, సరో‌జా‌దేవి, అల్లు‌రా‌మ‌లిం‌గయ్య, సూర్య‌కాంతం మొద‌లైన వాళ్లంతా ఉప‌పా‌త్రధా‌రులే.‌ డాక్టరు శివ‌రా‌మ‌కృష్ణ, లక్ష్మీ‌కాం‌తమ్మ వంగర వెంక‌ట‌సు‌బ్బయ్య, బొడ్డ‌పాటి, అన్న‌పూ‌ర్ణమ్మ, ఎ.‌ఎన్‌.‌నారా‌యణ, వడ్ల‌మాని విశ్వ‌నాథం, కాశీ‌నా‌థ్‌తాతా, డాక్టర్‌ రమేష్, మద్దాలి కృష్ణ‌మూర్తి, మహం‌కాళి వెంకయ్య, సి.‌ నాగే‌శ్వ‌ర‌రావు మొద‌లైన నటులు ఎక్కు‌వగా ఉప‌పా‌త్రలు ధరిం‌చారు.‌

ఒక దృశ్యంలో వచ్చినా కొన్ని ‌పా‌త్రలు చిత్రంలో మెరుపు మెరు‌స్తాయి.‌ ఉదా‌హ‌ర‌ణకి ముత్యా‌ల‌ము‌గ్గులో మాడా, మాయా‌ బ‌జా‌ర్‌లో కంచిక నర‌సిం‌హా‌రావు, ‌‘మిస్సమ్మ’‌లో గుమ్మడి, ‌‘బ్రహ్మ‌చారి’‌లో నేను−‌ (డాక్ట‌ర్‌గా) బాగా గుర్తుం‌టారు.‌ ఇంకా అలాంటి ఉప‌పా‌త్రలు ప్రేక్ష‌కు‌లకి చేరువై పది‌కా‌లాల పాటు గుర్తు‌న్నా‌యంటే కారణం ఆ పాత్రల్ని సృష్టిం‌చిన దర్శక, రచ‌యి‌తలు.‌
article image
article image
article image
article image
article image
article image
article image


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.