‘శత్రువు’కి 30 ఏళ్లు

ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌తో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘శత్రువు’. విజయశాంతి కథానాయిక. క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. అశోక్, విజయ పాత్రల్లో వెంకీ, విజయశాంతి నటన అద్భుతం. కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్ర సినిమాను మరో స్థాయికి చేర్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సుమంత్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ తొలి చిత్రమిదే. ఈ చిత్రంతోనే ఎం.ఎస్‌.రాజు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. రాజ్‌-కోటి సంగీత స్వరాలు శ్రోతల్ని విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా ‘అమ్మ సంపంగి రేకు’, ‘పొద్దున్నే పుట్టింది’ పాటలు సంగీత ప్రియుల్ని ఊపేశాయి. నిజాయతీతో ఉండే న్యాయమూర్తి దందా చేసే వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోతే, ఆ న్యాయమూర్తి దగ్గర పనిచేసిన జూనియర్‌ లాయర్లు ఏం చేశారు? అనే ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. వచ్చి 29 వసంతాలు అయిందంటే నమ్మగలరా! 1991 జనవరి 2న విడుదలయ్యాడు ‘శత్రువు’.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.