‘శ్రీరామదాసు’కి 14 ఏళ్లు

భక్తి చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే దర్శకుల్లో రాఘవేంద్రరావు మ³ందుంటారు. కథానాయకుల్లో నాగార్జున నేనున్నానంటారు. అలా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీ రామదాసు’ ఓ అద్భుత దృశ్య కావ్యం. (కంచెర్ల గోపన్న) రామదాసుగా నాగ్‌ నటన అనిర్వచనీయం. ఆయన భార్య కమల పాత్రలో స్నేహ ఒదిగిపోయింది. అక్కినేని నాగేశ్వరావు కబీర్‌దాస్‌ లాంటి ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు. వీళ్లు మాత్రమే ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. సుజాత, నాజర్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, అలీ, రఘుబాబు, సుమన్, రంగనాథ్‌ తదితరులు తమదైన శైలిలో అలరించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం కథకు ప్రాణం పోసింది. శ్రీరామ నవమి రోజు ఎక్కడ విన్నా ఈ సినిమాలోని పాటలే మారుమోగుతాయి. ప్రతి ఫ్రేములోనూ భక్తిని నింపి ప్రేక్షకులందరితో ‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’ అనిపించారు రాఘవేంద్రరావు. ఆయన ప్రతిభకు ఇదో నిదర్శనం. తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకునే సినిమాల్లో నిలుస్తుంది ‘శ్రీరామదాసు’. నేటితో ఈ చిత్రం విడుదలై పద్నాలుగేళ్లు అయింది. 2006 మార్చి 30న ప్రేక్షకుల మ³ందుకు వచ్చాడు రామదాసు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.