మిస్‌..మిస్టరైంది

నాయిక అదా శర్మ తొలిసారిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘మ్యాన్‌ టు మ్యాన్‌’.నవీన్‌ కస్తూరియా కథానాయకుడు. అదా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీసాలు పెట్టుకుని దిగిన ఫొటో షూట్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇలాంటి పాత్రలో ఇప్పటివరకు ఏ కథానాయిక నటించలేదు. ఈ సినిమాలో నవీన్‌.. అదా అందాన్ని చూసి ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. తీరా చూస్తే ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అన్నదే సినిమా కథ. సినిమా కథ వినగానే అదా ఒప్పుకొన్నారట. ఇలాంటి ఛాలెంజింగ్‌ పాత్రలు వస్తే భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రాల్లో నటిస్తానంటోంది అదా. తెలుగులో అదా.. ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘ సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాల్లో నటించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.