మౌనం మంచింది కాదు అంటున్న..హైదరీ

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగుతెరకి పరిచయమైన నటి అదితి రావు హైదరీ. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఈ మధ్య ఓ ముఖాముఖి సమావేశంలో హైదరీ మాట్లాడుతూ..‘‘చిత్రసీమలో లైంగిక వేధింపులు అనేవి లేవు అని చెప్పలేను. ఎందుకంటే? కొంతమంది పెద్దలు మీకు అవకాశం కావాలంటే నీకది..నాకిది అన్నట్లైతే అవకాశం ఇస్తామన్నారు. అలాంటి అవకాశం నాకు అవసరం లేదుని చెప్పి తప్పుకున్నాను. అలా కాకుండా ఏమీ మాట్లాడకుండా ఉంటే మన మౌనాన్ని వాళ్లు అంగీకారంగా భావించే అవకాశం కూడా ఉందని’’ చెబుతోంది. హైదరీకి అమీర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌రావు సోదరీ అవుతారు. ‘సమ్మోహనం’ చిత్రానికి ముందు హైదరీ మణిరత్నం దర్శకత్వంలో కార్తీతో కలిసి ‘చెలియా’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం తెలుగులోకి అనువాదమైంది. గత ఏడాది వరుణ్‌తేజతో కలిసి ‘అంతఃరిక్షం 9000కెఎమ్‌పిహెచ్‌’లోనూ చేసింది. ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో నానితో కలిసి ‘వి’ అనే చిత్రంలో నటిస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.