అక్షయ్‌కుమార్‌తో కలిసి మరోసారి సందడి చేయనుంది శ్రీలంక సుందరి జాక్వెలైన్ ఫెర్నాండెజ్. అక్షయ్ ప్రధాన పాత్రలో తెర కెక్కుతోన్న చిత్రం ‘బచ్చన్‌పాండే’. ఈ చిత్రబృందంలోకి జాక్వెలైన్ చేరింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఇందులో కృతిసనన్ మరో నాయిక. ఈ చిత్రంలో భాగమైనందుకు జాక్వెలైన్ ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఆ అనుభూతి ఎలా ఉండనుందో అని ఎదురుచూస్తున్నాను. షాజిద్ సార్, అక్షయ్‌లతో కలిసి మళ్లీ మళ్లీ పనిచేయడం సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’’అని చెప్పింది జాక్వెలైన్. ఇందులో అక్షయ్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా, కృతి జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. అక్షయ్ స్నేహితుడిగా అర్షద్ వార్షి నటిస్తున్నాడు. జనవరిలో రాజస్థాన్‌లో జరిగే షెడ్యూల్లో జాక్వెలైన్ సెట్లోకి అడుగుపెట్టనుంది.