రెండో సినిమాకు సంతకం చేసిన అలయ!

ల్లి నుంచి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అందాల తార అలయ ఎఫ్‌. పూజాబేడి కూతరుగా చిత్రసీమలోకి ప్రవేశించినా, తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకుంది అలయ. ఈ మధ్యనే విడుదలై బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రం ‘జవానీ జానేమన్‌’. ఈ చిత్రంలో టబు కూతురిగా అలయ బాగా నటించిందని విమర్శకుల నుంచి మెప్పుపొందింది. ప్రస్తుతం పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో రాబోయే చిత్రం కోసం అలయ అంగీకారం కూడా తెలిపింది. ఇప్పటికే ఇదే సంస్థపై మొదటి చిత్రంలో నటించిది. తిరిగి మళ్లీ అదే సంస్థలో అవకాశం వచ్చిన సందర్భంగా అలయ మాట్లాడుతూ..‘‘మరోసారి నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినందకు నేను సంస్థకు ఎంతో రుణపడి ఉంటాను. మంచి కథలతో తెరకెక్కించే ఈ సంస్థలో మరోసారి నా పాత్రకు నా శక్తిమేర న్యాయం చేస్తానని’’ చెబుతోంది. గత నెల 31వ తేదీన విడుదలైన ‘జవానే జానేమన్‌’ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పిస్తుంది. సైఫ్‌ అలీఖాన్, టుబులతో కలిసి అలయ ఈ చిత్రంలో నటించింది. ఇప్పుడు అలయ చేయబోయో రెండో చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. సారా అలీఖాన్, వరుణ్‌ ధావన్‌లు నాయికానాయికలుగా పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున మరో చిత్రం ‘కూలీ నెం.1’ మే 1, 2020న విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.