నాకెలాంటి గాయాలు కాలేదు!

బాలీవుడ్‌ నటి అలియా భట్‌కి షూటింగ్‌లో గాయపడిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం అలియా, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గంగుబాయి కతియావాడి’లో చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అలియాకు గాయమైందంటూ వస్తున్న వార్తలపై నటి అలియా స్పందిస్తూ..‘‘షూటింగ్‌లో నాకెలాంటి గాయాలు కాలేదు. నాపై వచ్చే వార్తలన్నీ నిరాధారమైనవి. గతంలో నాకు ఓసారి చిన్న దెబ్బ తగిలింది. అందువల్లే ఒకరోజు విశ్రాంతి తీసుకున్నా. అంతేకానీ ఇప్పుడు సెట్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు. నేను తిరిగి ఈరోజు నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నా’’అంటూ పోస్ట్‌ చేసింది. ప్రముఖ రచయిత హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ పుస్తకాధారంగా చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో అలియా వేశ్యగా నటిస్తోంది. ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన సీత పాత్రలో నటిస్తోంది.



View this post on Instagram

A post shared by Alia ?? (@aliaabhatt) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.