అమితాబ్‌-అజయ్‌-రకుల్‌

బిగ్‌ బీ అమితాబ్‌ కథానాయకుడుగా ప్రముఖ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆయనే. అంతేకాదు ముఖ్య పాత్రలోనూ కనిపించనున్నారు అజయ్‌. ఇందులో పైలట్‌గా కనిపిస్తారాయన. తాజాగా నాయిక వివరాలు వెల్లడించింది చిత్రబృందం. యువ నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవుతోంది. కో పైలట్‌గా దర్శనమివ్వనుంది. ‘అమితాబ్‌తో నటించాలనే నా కల నెరవేరబోతుంది. అజయ్‌ దేవగణ్‌ నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’నని ట్వీట్‌ చేసింది రకుల్‌. ఈ డిసెంబరులో హైదరాబాద్‌లో షూటింగ్‌ మొదలవుతుంది. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మేడే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. అజయ్‌ దేవగణ్‌కు దర్శకత్వం చేయడం కొత్తేమీ కాదు. 2008లో ‘యు మీ ఔర్‌ హమ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కాజోల్‌ కథానాయిక. ఈ సినిమాకు రచన, నిర్మాణ బాధ్యతలను కూడా అజయ్‌ చూసుకున్నారు. ఇప్పుడు ‘మేడే’ కోసం మరోసారి కెప్టెన్‌ కుర్చీలో కూర్చోబోతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.